అందరికీ సమాన అవకాశాల కోసమే ఇబిసి రిజర్వేషన్లు

అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి జాతీయ జాతీయ మండలి సమావేశాల్లో ప్రసంగిస్తూ దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు చెందిన ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఇబిసి రిజర్వేషన్లపై ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఇతర వెనుకబడిన కులల మధ్య భయాందోళనలు సృష్టించడానికి తన రాజకీయ ప్రత్యర్థులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ రాజకీయ లబ్ధి కోసం ఒక భయంకరమైన ప్రచారాన్ని వారు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. 

ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాలకు రిజర్వేషన్లను ఎవ్వరూ కాదనలేరన్నది నిర్వివాదాంశం. చారిత్రకంగా ఈ వర్గాలు అన్యాయానికి గురయ్యాయి. బాబాసాహెబ్ అంబెడ్కర్ అందించిన రేజర్వేషన్లు అప్పుడు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఎప్పటికీ ఉంటాయి అని మోడీ స్పష్టం చేశారు.  ప్ప్రస్తుతం ఉన్న రేజర్వేషణలకు ఎటువంటి ఢోకా లేదని, తమ ప్రభుత్వం అదనంగా రేజర్వేషన్లు కల్పిస్తున్నదని ప్రధాని స్పష్టం చేశారు.