కొత్త జోన్లకు ప్రధాని మోడీ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం ఎన్నల్లోగానో ఎడురుచుస్తున్న కొత్త జోన్ల ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు. రెండు, మూడు రోజులలో ఈ విషయమై రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని హామీ ఇచ్చారు. గత రాత్రి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కలసి, పరిస్థితిని వివరించిన తర్వాత ప్రధాని ఆమోదం తెలుపుతూ సంతకం చేసారని అధికార వర్గాలు తెలిపాయి.

స్థానికులకు ఉద్యోగాలే లక్ష్యంగా జోనల్ వ్యవస్థను రూపొందించినట్లు ప్రధాని మోడీ కి తెలిపారు. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ప్రధానికి వివరించారు.  సీఎం కేసీఆర్ వివరణకు ఏకీభవించిన ప్రధాని మోడీ సానుకూలత వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన పై కూడా ప్రధాని సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

23 నిమిషాల బాటు జరిగిన సమావేశంలో పలు అంశాల పై చర్చించారు. స్థానికులకు 90 శాతం ఉద్యాగాలు లక్ష్యంగానే జోనల్ వ్యవస్థ రూపొందించడానికి గలకారణాలను ప్రధానికి వివరించారు. హైకోర్టు విభజనకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసులు పెండింగులో ఉన్న వీలైనంత తొందరలోనే సానుకూలత ఉంటుందని సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రయత్నించినప్పుడు జోనల్‌ వ్యవస్థ పెండింగ్‌లో ఉన్న కారణంగా హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పోస్టు నుంచి ఏ నియామకం జరపాలన్నా జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలుపుతూ కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం అత్యవసరమని ప్రధానికి విన్నవించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ కూలంకషంగా వివరించిన తర్వాత సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి ఆ వెంటనే కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం తెలుపుతూ దస్త్రంపై సంతకం చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రి సంతకం చేసిన విషయాన్ని కేసీఆర్‌ స్వయంగా అధికారులు, పార్టీ నేతలకు చెప్పారు.