కాలుష్య రవాణాలో మేటి బెంగలూరు, హైదరాబాద్, చెన్నై

భోపాల్, కొలకత్తా నగరాలు దేశంలోనే అతి తక్కువ కాలుష్య, ఇంధన ఉపయోగ నగరాలు కాగా, మెగా నగరాలైన బెంగలూరు, హైదరాబాద్, చెన్నైలు మాత్రం కాలుష్య పరంగా అత్యంత తక్కువ పరిశుబ్ర నగరాలుగా నిలిచాయి. దేశంలోని ఆరు మెగా నగరాలో నగర ప్రజలలో అత్యంత తక్కువ కాలుష్యంతో, నగర రవాణాకు తక్కువ ఇంధనం ఉపయోగిస్తున్న నగరంగా భోపాల్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా, కొలకత్తా రెండో స్థానంలో ఉంది.

దేశంలో అత్యధికంగా ప్రజా రవాణా వ్యవస్థలు గల మూడో నగరమైనప్పటికి కాలుష్యంలో అడుగున ఉండటమే కాకుండా అత్యధికంగా ఇంధనం వాడకంలో సహితం పెరుగానించింది. అందుకు ప్రధాన కారణం వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా, ఎక్కువ దూరం వాడుతూ ఉండటమే అందుకు కారణం.

ఢిల్లీతో పోల్చుకొంటే మెగా నగరాలు బెంగలూరు, హైదరాబాద్, చెన్నైలలో ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. అయితే జనాభా తక్కువ కావడంతో మొత్తం ప్రయాణించే దూరం కూడా తక్కువగానే ఉంటుంది.

తక్కువ దూరం ప్రయాణించడం, తక్కువ సంఖ్యలో వాహనాలు ఉంటూ ఉండడంతో కాలుష్యం విషయంలో మెగా నగరాలకన్నా మెట్రోపాలిటన్ నగరాలూ మేరుగాగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా ఉండటం, వృద్ది రేట్ ఎక్కువగా ఉండడంతో ఈ నగరాలు ప్రమాదస్థాయిలో ఉన్నట్లు భావిస్తున్నారు. భారత దేశంలో అన్ని రంగాలలో కన్నా రవాణా రంగంలోనే కార్బన్ (కాలుష్యం) వాయువులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఆరోగ్యానికి హానికలిగించే విష పదార్ధాలను వేదజల్లడంలో సహితం నగరాలలోని ట్రాఫిక్ కీలక భూమిక వహిస్తున్నది.

ఈ విషయమై ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్మెంట్ 14 నగరాలకు సంబంధించిన గణాంకాలను విశ్లేషించి భారత దేశంలోని నగరాలలో స్వచ్చమైన, తక్కువ కాలుష్యం గల రవాణా వ్యవస్థలు ఏమేరకు అందుబాటులో ఉన్నాయో అని అధ్యయనం చేసారు. ఏ నగరాలు రవాణా వ్యవస్థల ద్వారా ఎక్కువగా కాలుష్యం అవుతున్నాయో పరిశీలించారు.

ఈ విశ్లేషణల ఆధారంగా రూపొందించిన “ది అర్బన్ కమ్యూట్” నివేదికను విడుదల చేసారు. అన్ని రంగాలలో విడుదలవుతున్న కార్బన్ కాలుష్యంతో పోల్చుకొంటే రవాణా రంగం మూడో పెద్దది అయినప్పటికీ అది అత్యంగా వేగంగా పెరుగుతూ ఉండడంతో పాటు, అనారోగ్యానికి ప్రధాన కారణం కావడం,

నగరాలలో వ్యక్తిగత వాహనాల ఉపయోగం విశేషంగా పెరుగుతూ ఉండడంతో ఈ నివేదికను విడుదల చేస్తున్నామని సి ఎస్ ఇ కార్యనిర్వాహక డైరెక్టర్ అనుమిత రాయ్ చౌదరి పేర్కొన్నారు. నగరాలో పెకాలుష్యం, వాతావరణ సంక్షోభాన్ని కట్టడి చేయడం కోసం సమగ్రమైన ప్రజా రవాణా కల్పించడం, నివాస ప్రాంతానికి – ఉద్యోగం చేసే చోటకు దూరం తగ్గించడం, నడక-సైకిల్ పై ప్రయాణం పెరాగడం, వ్యక్తిగత వాహనాల ఉపయోగంపై ఆంక్షల అవసరాన్ని ఈ నివేదిక వెల్లడి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

కాలుష్యం, ఇంధన వినియోగం : 1. భోపాల్, 2. విజయవాడ, 3. చండీఘర్, 4. లక్నో, 5. కొచ్చి, 6. జైపూర్, 7. కొలకత్తా, 8. ఆహ్మేదాబాద్, 9. పూణే, 10.ముంబై. 11. హైదరాబాద్,   12.బెంగలూరు, 13. చెన్నై, 14. ఢిల్లీ.

ఒకొక్క ప్రయాణంలో కాలుష్యం,ఇంధన వినియోగం : 1. కొలకత్తా, 2,ముంబై, 3.భోపాల్,   4. ఢిల్లీ, 5. ఆహ్మేదాబాద్,  6.లక్నో, 7.విజయవాడ,  8. పూణే, 9. జైపూర్, 10.చెన్నై,   11. బెంగలూరు, 12. కోచి, 13. చండీఘర్,14. హైదరాబాద్.