నిరసనలతో అట్టుడిగుతున్న కేరళ .. హర్తాళ్ కు పిలుపు

కేరళలోని సిపిఎం ప్రభుత్వం పోలీసుల సహాయంతో, హిందువుల విశ్వాసాలను సవాల్ చేస్తూ మగవారి దుస్తువులలో ఇద్దరు ఆడవారిని అర్ధరాత్రి, దొడ్డి దోవన శబరిమలలోని స్వామి అయ్యప్ప దేవాలయంలోకి పంపడం పట్ల కేరళ అంతటా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పునరాయి విజయం ప్రభుత్వంపై అగ్రహారాలు వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్ర రాజధానిలో అసెంబ్లీ ఎదుట హిందువుల నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం కోసం పోలీస్ లు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. పలు చోట్ల హింసాయుత సంఘటనలు సహితం చోటు చేసుకొంటున్నాయి 

రాష్ట్ర రాజధానితో పాటు పలు పట్టణాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనగా షాప్ లను మూయిస్తున్న ప్రదర్శకులపై పోలీసులు బల ప్రయోగానికి పూనుకొంటున్నారు. రహదారులలో రాస్తా రాకోలు జరుపుతూ ఉండడంతో ట్రాఫిక్ ఆగిపోతుంది. 

హిందువుల పట్ల విద్రోహకరంగా వ్యవహరించిన విజయన్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం రాష్ట్రం అంతటా  హర్తాళ్ పాటించాలని శబరిమల కర్మ సమితి నేత కె పి  శశికళ పిలుపిచ్చారు. సెప్టెంబర్ 29న అన్ని వయస్సుల మహిళలను దేవాలయంలోకి అనుమతించాలని అంటూ సుప్రీం కోర్ట్  ఇచ్చిన తీరుపును ధిక్కరిస్తూ ఈ సంస్థ ఆధ్వర్యంలో  అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. 

దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి మొత్తం కర్త ముఖ్యమంత్రి పినరాయి విజయన్  మాత్రమే బాధ్యుడు అని స్పష్టం చేస్తూ విజయన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని శశికళ ప్రకటించారు. ప్రభుత్వం `పిరికితనం'తో దొంగచాటుగా, అర్ధరాత్రి ఆ ఇద్దరు మహిళలను దేవాలయంలోకి తీసుకు వెళ్ళినది ఆమె మండిపడ్డారు. 

ఇలా ఉండగా, ఇద్దరు మహిళలు దేవాలయంలో ప్రవేశింప చేసేటట్లు చేయడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు సిపిఏం ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. దేవాలయంలో ఇద్దరు మహిళల ప్రవేశం హిందువుల మనోభావాలను `గాయ' పరచిన్నట్లు ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల ధ్వజమెత్తారు. ఇది  ముఖ్యమంత్రి మొండి ధోరణిని వెల్లడి చేస్తున్నదని దుయ్యబట్టారు. 

డిసెంబర్ 24 నుండి ఆ ఇద్దరు మహిళలు ఇళ్లలో లేరని అంటూ అప్పటి నుండి వారు పోలీస్ రక్షణలోనే ఉన్నట్లు వెల్లడి అవుతుందని, ఇదంతా ముఖ్యమంత్రి ఆడించిన నాటకమే అని రమేష్ చెన్నితాల ఆరోపించారు. `శుద్ధి'చేయడం కోసం దేవాలయాన్ని మూసి వేయడం వంద శాతం కరెక్ట్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్షం యూడీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేబడుతుందని ప్రకటించారు. 

శబరిమల దేవాలయంలో చేసిన దుశ్చర్య కారణంగా కేరళ ప్రభుత్వం స్వామి అయ్యప్ప ఆగ్రహానికి గురవుతారని బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు పి ఎస్ శ్రీధరన్ పిళ్ళై హెచ్చరించారు. కోట్లాది భక్తుల మనోభావాలను  రాష్ట్ర ప్రభుత్వం విద్రోహ పూర్వాహకంగా వ్యవహరించినదని ధ్వజమెత్తారు.