అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో ‘ఫ్యామిలీ బామ్’ ఏమిటబ్బా?

జండు బామ్, టైగర్ బామ్ గురించి విన్నాం కానీ, ప్రతి మధ్యవర్తి కోరుకుంటున్న ఈ ‘ఫ్యామిలీ బామ్’ ఏమిటబ్బా? అంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారు. అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో మధ్యవర్తి  క్రిస్టియన్ మిషెల్ తనను విచారిస్తున్న సందర్భంగా అడిగిన ప్రశ్నలతో ఒక కాగితాన్ని తన న్యాయవాదికి ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఆ కాగితం తనకు అందిందని మిషెల్ న్యాయవాది అంగీకరించారు. అది మందుల జాబితా అని ఆయన అనుకున్నారు. దానిని పారదర్శకంగా ఏ సందర్భంలోనైనా ఇవ్వవచ్చు" అంటూ ఈ సందేహం వ్యక్తం చేశారు. 

అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ వెల్లడిస్తున్న వివరాలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. మధ్యవర్తులందరూ ‘ఫ్యామిలీ బామ్’ కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ఇచ్చిన నాలుగు ట్వీట్లలో మిషెల్ తరపు న్యాయవాదికి ఓ విజ్ఞప్తి చేశారు. మిషెల్‌, భారతదేశంలోని ఓ కుటుంబం మధ్య ఉన్న స్నేహం ఏమిటో వివరించాలని కోరారు.

‘‘అగస్టా వెస్ట్‌లాండ్ కేసు జాడలు... క్రిస్టియన్ మిషెల్ రక్షణ కోసం కేకలు... శ్రీమతి గాంధీపై ప్రశ్నిస్తున్న వివరాలను క్రిస్టియన్ మిషెల్ తన న్యాయవాదికి ఎందుకు ఇచ్చారో ఎవరికైనా తెలుసా? ఆ వివరాలు నేరుగా శ్రీమతి గాంధీకి అందాలని ఆయన కోరుకున్నారా? ఎందుకు?’’ అని ఓ ట్వీట్‌లో అమిత్ షా ప్రశ్నించారు.

మూడో ట్వీట్‌లో ‘‘ఏమైనప్పటికీ, మళ్ళీ మళ్ళీ చెప్పవలసినది ఏమిటంటే, మిషెల్ తరపు న్యాయవాదికి కల కాంగ్రెస్ నేపథ్యం గురించి చెప్పాలి. ఆయనను (కాంగ్రెస్ నుంచి) బహిష్కరించడమనేది బూటకం. ఆయన మిషెల్‌కు, శ్రీమతి గాంధీకి వారథిగా కొనసాగుతున్నారు’’ అని పేర్కొన్నారు.

నాలుగో ట్వీట్‌లో ‘‘దేశ ప్రయోజనాల కోసం, 2008 నాటి డాక్యుమెంట్ల గురించి మిషెల్ తరపు న్యాయవాది మనకు చెప్పాలి. స్పష్టంగా తెలిసేదేమంటే, మిషెల్‌కు, భారతదేశంలోని ఓ కుటుంబానికి మధ్య మైత్రి కాల పరీక్షకు నిలిచినది, గాఢమైనది’’ అని పేర్కొన్నారు.

క్రిస్టియన్ మిషెల్ తరపున వాదిస్తున్న న్యాయవాది అల్జో కే జోసఫ్ గతంలో యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించేవారు. మిషెల్‌ను భారతదేశానికి రప్పించిన తర్వాత ఆయన తరపున వాదనలు వినిపించేందుకు జోసఫ్‌ నియమితులయ్యారు. ప్రతిపక్షాలు నిలదీయడంతో జోసఫ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.