రూ 700 కోట్ల సహాయం ప్రకటించలేదన్న యూఏఈ

వరదలలో తీవ్ర నష్టానికి గురైన కేరళలో పునరావాస కార్యక్రమాల కోసం యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన్నట్లు భావిస్తున్న రూ700కోట్ల సహాయాన్ని అంగీకరించే విషయమై దేశంలో ఒకవంక రాజకీయ వివాదం చెలరేగుతుండగా, మరోవంక అసంలు తామా సహాయమే ప్రకటించాలేదని ఇప్పుడా దేశం పేర్కొనడం సంచలనం కలిగిస్తున్నది. కేరళకు ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పటివరకూ తమ ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని యూఏఈ రాయబారి అహ్మద్ అల్ బన్నా పేర్కొనడంతో ఈ అంశం మరో మలుపు తిరుగుతుంది.

వరదలు, అనంతరం జరిగిన పరిణామాల వల్ల కేరళ ఎంత నష్టపోయిందో, ఎంత ఆర్థిక సాయం అవసరమో అంచనా మాత్రమె వేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే కేరళకు జరిగిన నష్టంపై యూఏఈ జాతీయ విపత్తు కమిటీని ఏర్పాటు చేసిందని, కేరళలో జరిగిన నష్టంపై అంచనా వేసి, తమ స్నేహితులైన కేరళ ప్రజలకు ఆర్థిక సాయాన్ని, మందులను  పంపించడమే ఈ కమిటీ ఉద్దేశమని ఆయన చెప్పారు. ఆ దేశంలో ఉన్న 30 లక్షల మంది బహారతీయులలో 80 శాతం మంది కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. కాగా,  

కేరళను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి కూడా తాము పనిచేస్తున్నామని ఆ రాయబారి తెలిపారు. ఇదిలా ఉంటే, కేరళకు రూ.700 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి యూఏఈ ప్రభుత్వం ముందుకొచ్చిందని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

అయితే పకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు విదేశీ ప్రభుత్వాల నుండి సహాయం స్వికరించారాదని 2004లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తమిళనాడులో సునామి సంభావిచినప్పుడు నిర్ణయించారని, ఆ విధానాన్నే అప్పటి నుండి అనుసరిస్తున్నరని కేంద్ర హోం శాఖ ప్రకటించడంతో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.

ఎట్లాగైనా విదేశీ సహాయం పొందాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి విజయన్ ఈ విషయమై తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని కలసి కేరళకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వమని కోరగాలరని ప్రకటించారు.

ఇట్లా ఉండగా, కేరళకు అందించిన రూ 600 కోట్ల సహాయం తాత్కాలిక సహాయం మాత్రమె అని, ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత పూర్తి సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కాకుండా రాష్ట్ర విపత్తు సహాయ నిధికి రూ 562.45 కోట్లు అందుబాటులో ఉన్నదని తెలిపింది.

 పైగా ఎప్పటికప్పుడు అవసరమైన సహాయం, సహాయ సామాగ్రి అందిస్తూనే ఉన్నమంటూ ఇప్పటి వరకు జరిగిన సహాయ కార్యక్రమాలలో అత్యంత పెద్దవని పేర్కొన్నారు. సహాయ కార్యకలాపాలలో 40 హెలికాప్టర్లు, 31 విమానాలు, 182 సహాయ బృందాలు, 18 రక్షణ దళాల వైద్య బృందాలు, 58 ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు పాల్గొన్నట్లు వివరించారు.