యాక్సిడెంటల్ సీఎం కుమారస్వామి

`యాక్సిడెంటల్ ప్రధాన మంత్రి' అంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై విడుదలకు ఒక సినిమా సిద్దమవుతూ ఉండగా కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వం ఉలిక్కి పడుతున్నది. తమ పార్టీని నడిపించే కుటుంభం పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను అందులో తక్కువచేసి చూపుతున్నారంటూ గగ్గోలు పడుతున్నాయి. 

మరోవంక కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామిని `యాక్సిడెంటల్ సి ఏం' అంటూ రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎద్దేవా చేస్తున్నది. సొంత బలం లేకపోయినా, కేవలం 36 మంది ఎమ్యెల్యేలతో 2019 ఎన్నికలపై కన్ను వేసి, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీల మెప్పు పొందటం కోసం అంటూ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి రావడం తెలిసిందే. 

రా ష్ట్రంలో వర్షాభావంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటుంటే పట్టించేకోకుండా సీఎం కుమారస్వామి నూతన సంవత్సర వేడుకల కోసం గత రాత్రి కుటుంభ సభ్యులతో కలసి సింగపూర్ కు బయలుదేరి వెళ్లడాన్ని బిజెపి తూర్పురాబట్టింది. ముఖ్యమంత్రి జనవరి 1 రాత్రికి తిరిగి వస్తారని అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలను కుటుంభ సభ్యులతో వేరే చోటకు వెళ్లి జరుపుకోవడం ఆయనకు అలవాటు అట. 

 రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు దీరాక కరువుతో 377 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బిజెపి నాయకత్వం పేర్కొన్నారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన రుణమాఫీ అధికారమలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇంకా అమలుకు నోచుకోలేదని బిజెపి ధ్వజమెత్తింది. 

ఒకవేళ యాక్సిడెంటల్ సీఎం అనే సినిమా తీస్తే కుమారస్వామి పాత్ర పోషించేదెవరు? అని మరో ట్వీట్‌లో బిజెపి ఎద్దేవా చేసింది.