కడప ఉక్కు చంద్రబాబు ప్రచార అస్త్రమేనా !

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు.  3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో, 3 వేల ఎకరాలలో, రూ 18 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిశ్రమ కోసం జమ్మలమడుగు నుంచి 12కి.మీ రైల్వేలైన్‌ను ఏర్పాటు చేస్తున్నన్నట్లు చెప్పారు. 

కేవలం కేంద్రంపై అభాండాలు వేయడం కోసం, కేంద్రం స్పందించక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పనులు చేయగలదని ప్రజలను ఎన్నికల ముందు నమ్మించడం కోసమే శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం చెప్పారు. రాయలసీమను ఉద్ధరించడం కోసం ఏదో చేస్తున్నామని ప్రజలను మభ్యపరచి వచ్చే ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసమే ఈ నాటకం ఆడుతున్నట్లు వెల్లడి అవుతుంది. 

మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయని చెప్పడం ద్వారా ఎన్నికలయ్యే వరకు పనులు చేపట్టే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు. అసలు మళ్ళి అధికారమలోకి వచ్చినా ఈ ఫ్యాక్టరీ నిర్మించ గల సామర్ధ్యం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నాడని ఎవ్వరికీ నమ్మకం లేదు. అందుకు ప్రభుత్వం కూడా ఎటువంటి సన్నాహాలు ఇప్పటి వరకు చేయనే లేదు. కేవలం రాజకీయ డ్రామా ఆడుతున్నట్లు స్పష్టం అవుతుంది. 

ప్రైవేట్ భాగస్వామితో నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఆ భాగస్వామి ఎవ్వరో ఇప్పటి వరకు బైట పెట్టనే లేదు. దీనికోసం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు. అందుకు ఎవ్వరితో అయినా ఒప్పందాలు చేసుకున్నారా ? అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించి కూడా ఎటువంటి స్పష్టత లేనే లేదు. 

 ఏపీ ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితుల్లో  రూ  18 వేల కోట్ల పెట్టుబడితో సొంతంగా స్టీల్  ప్లాంట్ పెట్టగల సామర్ధ్యం ఈ ప్రభుత్వానికి ఉందా ?  ఇటువంటి మౌలిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అర్ధాంతరంగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడంలో ఔచిత్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆ మేరకు నిధులను సమీకరించగల సత్తా ఈ ప్రభుత్వనాయికి ఉంటె గత నాలుగున్నరేళ్లల్లో రాజధాని అమరావతికి  సంబంధించి ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని ఎందుకు  పూర్తి చేయలేకపోయారు ? కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పలు శంకుస్థాపనలకు పాల్పడుతున్నారు ? 

ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న నాలుగు సంవత్సరాల్లో ఏ రోజూ కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడింది లేదు ?ఎప్పుడైతే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచో కడప ఉక్కు..ఏపీ హక్కు అంటూ హంగామా ప్రారంభించారు ? ఈ ప్రశ్నలన్నీ ఈ శంకుస్థాపన తతంగం ఉద్దేశ్యాన్ని వెల్లడి చేస్తున్నాయి.