రైతులకు భారీ మేలు కలిగించడంకై ప్రధాని మోదీ కసరత్తు !

మరో వంద రోజులలో లోక్ సభ ఎన్నికలు జరపడానికి ఒక వంక కసరత్తు జరుగుతూ ఉండగా, దేశంలో రైతులకు మేలు జరిగే విధంగా ఒక భారత్ పధకాన్ని ప్రకటించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఈ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లతో ఈ విషయమై గత సాయంత్రం ప్రధాని మూడు గంటలకు పైగా సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు. మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి ప్రతికూల ఫలితాలు ఇవ్వడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ వ్యవసాయ రుణాల రద్దుకు హామీ ఇవ్వడం అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొనడం గమనార్హం. 

రైతులలో నెలకొన్న సంక్షోభం ప్రభుత్వం పట్ల ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. అందుకనే రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకోవడం వైపు ప్రధాని దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే అందరు ఉహిస్తున్నల్టు కేవలం రైతుల రుణాల రద్దుకు మాత్రమే ప్రధాని ఆలోచనలు పరిమితం కావడం లేదని చెబుతున్నారు.

 గిట్టుబాటు ధరలకు, మార్కెట్ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం గురించి తీవ్రంగా పరిశీలన జరుపుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం అమలు జరిపింది. 

మరోవంక ఝార్ఖండ్ లో బిజెపి ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్ణీత సబ్సిడీని నేరుగా రైతులకు అందించడం గురించి కూడా మదింపు చేస్తున్నట్లు చెబుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులలో రుణ పరిమితిని పెంచడం మరో ఆలోచనగా తెలుస్తున్నది. 

వీటన్నింటిని మించి కొద్దీ నెలల క్రితం రైతులకు ఉత్పత్తి ఖర్చులకు మించి 50 శాతం లాభం ఉండేవిధంగా మద్దతు ధర ఉండాలని ప్రధాని ప్రకటించడం తెలిసింది. దీనిని ఏ విధంగా అమలు చేయాలని నరేంద్ర  మోదీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు భారీ వరాలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో సమావేశమమ్యారు. మోదీ నివాసంలో మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రైతుల కోసం కొత్తగా కొన్ని చర్యలను ప్రకటించబోతోంది. వచ్చే నెల 5న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. అంతకుముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రైతులకు నేరుగా చెల్లించడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ఆలోచన జరిగినట్లు సమాచారం.

మధ్య ప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అమలు చేసిన భవతార్ స్కీమ్ (ధరల వ్యత్యాసం పథకం) విధానంలో ఈ నూతన పథకాన్ని రూపొందించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.