ముందస్తు ఎన్నికలపై కెసిఆర్ వెనుకడుగు !

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరపాలని నిర్ణయానికి వచ్చి సన్నాహాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమి మంత్రులతో బుధవారం ఏడుగంటల పాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపిన తర్వాత ఆయన మరింత సంశయంలో పడ్డారని తెలుస్తున్నది. ఈ సమావేశంలోనే ముందస్తు ఎన్నికలను ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తినా నిర్ణయాన్ని కెసిఆర్ వాయిదా వేయడం అందరికి విస్మయం కలిగిస్తున్నది.

ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం పట్ల మంత్రులు అందరు దాదాపుగా ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ముందస్తు స్పష్టమైన కారణం లేకుండా ఎన్నికలకు వెళ్ళిన పలువురు నాయకులు, పార్టీలు చావుదెబ్బ తినవలసి వచ్చినదని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఈ సంవత్సరమే రైతులు, బిసిలకు భారీ పధకాలు చేపట్టి, పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతుండగా అవి జనంలోకి పూర్తిగా వెళ్లకముందే ఇప్పుడే ఎన్నికలకు వెళితే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయనే మంత్రులు హెచ్చరించిన్నట్లు చెబుతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో ముందస్తుపై నిర్ణయాన్ని అధినేతకే వదిలేస్తున్నామంటూ కెసిఆర్ పైనే మంత్రులు అందరు భారం పెట్టడంతో ఆయన మరింతగా ఇరకాటంలో పడిన్నట్లున్నారు. తన నిర్ణయం పట్ల అందరు హర్షామోదాలు వ్యక్తం చేస్తారనుకున్న ఆయనకు నిరాశే ఎడురైనది. అందుకనే రెండు రోజులు ఆగి పార్టీ ఎంపిలు, ఎమ్యెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశం జరిపి ఈ విషయమై మరోసారి సమాలోచనలు జరపాలని భావిస్తున్నారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లకపోవటమే మంచిదంటూ మెజారిటీ మంత్రులు తమ అభిప్రాయాన్ని నిర్మోహటంగా చెప్పడంతో కెసిఆర్ సహితం పునరాలోచానలో పడిన్నట్లు కనిపిస్తున్నది. చివరకు కొడుకు కేటీఆర్‌కు సహితం ముందస్తు పట్ల అంత సుముఖంగా లేన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో కొన్ని పథకాలు పూర్తిగా అమలుకు నోచు కోలేదని, ఇంకొన్ని ఇప్పుడిప్పుడే జనంలోకి వెళుతున్నాయని,  మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో మనం ముందస్తుకు వెళితే పరిస్థితి 'ఉల్టా.. ఫల్టా...' కావచ్చంటూ మంత్రులు హెచ్చరిక స్వరంతోనే విముఖత వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు.

ఇట్లా ఉండగా ముందస్తు కోసం అసెంబ్లీని రద్దు చేసి కుర్చొంటే, ఎన్నికల కమీషన్ ఎన్నికలకు సిద్ద పడని సమయంలో పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు సహితం తలెత్తుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉండగా ఇప్పుడు ముందస్తు ఎందుకని రాష్ట్రపతి పాలనకు పరిస్థితులు దారితేస్తే మన సంగతి ఎమవుతుందనే భయం కూడా అధికార పక్షం నేతలలో వ్యక్తం అవుతున్నది.

సర్వేలలో తమకు సానుకుత ఫలితాలు వస్తున్నాయని, వందకు పైగా సీట్లు గెల్చుకొంటామని కెసిఆర్ తరచూ చెబుతున్నా పార్టీ నేతలు ఎవ్వరిలో అటువంటి భరోసా కనిపించడం లేదు. అందరికి తిరిగి సీట్లు ఇస్తామని అధినేత హామీ ఇస్తున్నా చాలామందిలో నమ్మకం కనబడటం లేదు. పార్టీలో `తిరుగుబాటు’కు అవకాశం లేకుండా, అంతా బాగున్నదనే అభిప్రాయం కలిగించడం కోసమే తపన చెండుతున్నరనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.