సార్వత్రిక ఎన్నికలపై అసెంబ్లీ ఎన్నికలు ప్రభావం చూపవు

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరుగబోవు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించబోవని బిజెపి  జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా భరోసా వ్యక్తం చేశారు. ఈ ఐదు రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ విజయం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. మూడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఈ ఫలితాలు వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని పలువురు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే అటువంటి ఉహాగానాలను అమిత్ షా కొట్టిపారవేసారు. 

ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు బిజెపికి  అనకూలంగా రాలేదన్నది నిజమే. అయితే వాటిని 2019 లోక్‌సభ ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదు. రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పోల్చకూడదు. వేర్వేరు అంశాలపై అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి'అని పేర్కొన్నారు. 

 రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెబుతూ  ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తామని తెలిపారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి తాము  విజయం సాధించడం బిజెపికి మాత్రమే కాకుండా ఈ  దేశానికి కూడా ఎంతో అవసరం ఉన్నదని ఆయన  చెప్పుకొచ్చారు.

2014లో కేవలం 6 రాష్ట్రాల్లోనే బీజేపి  అధికారంలో ఉందని, కానీ  ఇప్పుడు 16 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని అమిత్ షా గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అర్థమవుతుందని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలపై అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల మహాకూటమి ఎంతోకాలం నిలువలేదని, అది కేవలం వారి భ్ర