ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కేరళ ఉపద్రవం !

శతాబ్ద కాలంలో కనివిని ఎరుగని తీవ్రమైన ఉపద్రవానికి కేరళ గురి కావడానికి పకృతి విపత్తు ఒక వంక, పర్యావరణం పట్ల పాలకుల నిర్లక్ష్యం మరోవంక కారణం కాగా, ప్రమాద స్థాయి అంచనాలకు అందనంత ఎక్కువగా ఉండడానికి అక్కడ కొలువు తీరిన సిపియం నేతృత్వంలోని పినరాయి విజయన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఇప్పుడు స్పష్టమవుతుంది. ఇది `మానవ నిర్మిత’ ఉపద్రవం అంటూ ఒకవంక కాంగ్రెస్, మరోవంక బిజెపి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.

రాస్త్రంలో 40 వరకు గల డ్యామ్ లను అర్ధంతరంగా మూసివేసిన కారణంగానే వరదలు ఉగ్రరూపం దాల్చాయని, అపారమైన నష్టాలు కలిగాయని భావిస్తున్నారు. ఒక మాదిరి ప్రణాళికతో, ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయగలిగినా ఇంతటి ప్రళయం జరిగి ఉండెడిది కాదని స్పష్టం చేస్తున్నారు. ప్రమాదానికి ప్రజలను సిద్దం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిన్నట్లు స్పష్టం చేస్తున్నారు.

ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణ జరిపించాలని రాస్త్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎటువంటి ప్రణాళిక లేకుండా డ్యామ్ లను తెరవడం వల్లనని ఇతటి అరిష్టం జరిగినదని బిజెపి ఆరోపించింది.

డ్యామ్ ల యాజమాన్యాన్ని సక్రమంగా చేసి ఉండిన్నట్లయితే పరిస్థితి మరోవిధంగా ఉండెడిదని ప్రతిపక్ష నాయకుడు రమేష్ చేన్నితాల భావిస్తున్నారు. శాస్త్రవేత్తలే కాకుండా సాధారణ ప్రజలు కుడా నీటిని క్రమంగా విడుదల చేయాలనీ కోరినా లెక్క చేయకుండా జల విద్యుత్ సరఫారా చేసుకొంటూ పరిస్థితులు విషమించే వరకు కాలం గడిపారని విమర్శించారు. అందుకు బాధ్యులైన విద్యుత్, జలవనరుల అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలు వింటూ ప్రభుత్వం కాలం గడిపినదని, అప్రమత్తంగా వ్యవహరించలేదని దయ్యబట్టారు.

సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటె నష్టాలను పరిమితం చేసే అవకాశం ఉండేడిదని మాజీ విద్యుత్ మంత్రి అయిన కాంగ్రెస్ నేత అర్యదన్ మహమ్మద్ పేర్కొన్నారు. ఉదాహరణకు 2013లో వర్శాలక్లు ఇడుక్కి డ్యామ్ నీటితో నిండుతున్నప్పుడు ముందుగానే రాగల ముప్పును అంచనా వేసి ముందుగా చిన్న చిన్న షట్టర్ లను తెరిచామని గుర్తు చేసారు. కాని ఇప్పుడు చివరి క్షణం వరకు కాలక్షేపం చేస్తూ మొత్తం షట్టర్ లను ఒకేసారి తెరిచారని ద్వజమెత్తారు.

ప్రభుత్వం ముందుగా ప్రమాదాలను అంచనా వేసి, సకాలంలో తగు ముందస్తు చర్యలు తీసుకొన్న పక్షంలో వరదల ప్రభావం పరిమితంగా ఉండెడిదని రాష్ట్రం బిజెపి అద్యక్షుడు పి ఎస్ శ్రీధరన్ పిళ్ళై చెప్పారు. ముందుగానే క్రమంగా నీటిని విడుదల చేయకుండా ఇడుక్కి, చేరుతోని, ఎదమలయర్ డ్యామ్ లు నిండిపోయే వరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినదని నిపుణులు కుడా పేర్కొన్నట్లు గుర్తు చేసారు.

జూలై చివరకే పలు డ్యామ్ లలో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకొంటూ ఉంటె వీటిని ఎక్కువగా నిర్వహించే రాష్ట్ర విద్యుత్ బోర్డు ఆగష్టు మధ్య వరకు షట్టర్ లను తెరవకుండా ఏమి చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.