కేరళకు విదేశీ సహాయం తిరస్కరించనున్న కేంద్రం

వరద కోరల్లో చిక్కుకున్న కేరళ పుననిర్మానం కోసం విదేశాలు ప్రకటించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర పునర్నిర్మాణం, బాధితులకు పునరావాసం కోసం భారత్‌కు తోడ్పడేందుకు సిద్ధమని యూఏఈ, ఖతార్, మాల్దీవులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కేరళకు రూ. 700 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. దుబాయ్, కేరళ మధ్య అనుబంధానికి... భారత్-యూఏఈ మధ్య సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా అందరూ దీన్ని భావించారు. ప్రధాని మోదీ యూఏఈ అధినేతకు ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా యూఏఈకి కృతజ్ఞతలు చెప్పారు.

 విదేశాలు ప్రకటించిన సాయం పట్ల పూర్తి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నప్పటికీ 2004లో ఇటువంటి ఆపదలు సంభవించినప్పుడు విదేశీ సహాయం తీసుకోరాదని, సొంత వనరులనే ఉపయోగించుకోవాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు తమిళనాడులో సునామి సంభవించి 12 వేల మందికి పైగా ప్రజలు చనిపోయి, మరో ఆరు వేలమందికి పైగా నిరాస్రయులయిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్నే అనుసరిస్తున్నది.

అయితే ఈ విధానం విదేశీ ప్రభుత్వాల నుండి సహాయం తీసుకోవడానికే మాత్రమె వర్తిస్తుందని, ప్రవాస భారతీయులు, వ్యక్తిగతంగా పంపేవారికి, స్వచ్చంద సంస్థలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఖతార్ దాదాపు రూ.35 కోట్లు ఆఫర్ చేయగా, ఇటీవల భారత్‌తో స్నేహం కలుపుకున్న మాల్దీవులు కూడా 50 వేల డాలర్లు సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

ఆర్ధికంగా ప్రపంచంలో అతి పెద్ద వ్యవస్థలలో ఒకటిగా ఉంటున్న భారత్ ఎటువంటి విపత్తులనైనా తట్టుకో గలదనే సంకేతం పంపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అంతకు ముందు విదేశీ ప్రభుత్వాల నుండి సహాయం తీసుకొనేవారు. 1991లో ఉత్తరాఖండ్ భూకంపం, 1993లో లాతూర్ లో భూకంపం, 2001లో గుజరాత్ లోవ్ అర్దాలు, 2002లో పశ్చిమ బెంగాల్ లో తుఫాన్, 2004 జూలై లో బీహార్ లో వరదల సమయంలో విదేశీ సహాయం స్వికరించాము.

అయితే ఆ తర్వాత 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలో అమెరికా, జపాన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చినా భారత్ సున్నితంగా తిరస్కరించింది. అదే విధంగా కాశ్మీర్ లో భూకంపం, వరదలు వచ్చినప్పుడు కుడా విదేశీ సహాయం స్వీకరించలేదు.