ఫోర్బ్స్ జాబితాలో టాప్ టెన్‌లో పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టాప్‌లోకి దూసుకువెళుతోంది. ఆటలోనే కాదు సంపాదనలో కూడా. ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణిల జాబితాలో సింధు చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితాలో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో ఉండగా, ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన పీవీ సింధు సింధూ ఏడో స్థానంలో నిలిచింది.

ఆమె ఏడాది సంపాదన 85 లక్షల డాలర్లు (సుమారు రూ.59 కోట్లు)గా ఉంది. 23ఏళ్ల సింధూ ఓ వైపు బ్యాడ్మింటన్ ఆటతో పాటు మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. బ్రిడ్జ్‌స్టోన్, గాటోరేడ్, నోకియా, పానాసోనిక్,  రెక్కిట్ బెంకైసెర్‌తో పాటు డజనుకు పైగా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

మరోవైపు సెరినా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఆమె సోదరి  వీనస్‌ విలియర్స్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా టెన్నిస్ క్రీడాకారిణిలే కావడం విశేషం. అయితే  ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న 100మంది పురుషు అథ్లెట్ల జాబితాలో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కలేదు.

ఫోర్బ్స్ ప్రకటించిన పది స్థానాల జాబితాలో వరుసగా 1. సెరెనా విలియమ్స్‌, 2. కరోలిన్‌ వొజ్నొకి, 3. స్లోనే స్టీఫెన్స్‌ , 4. గార్బిన్‌ ముగురుజ, 5. మరియా షరపోవా, 6. వీనస్‌ విలియర్స్‌ (అందరూ టెన్నిస్‌), 7. పీవీ సింధు (బ్యాడ్మింటన్‌), 8. సిమోనా హలెప్‌ (టెన్నిస్‌), 9. డానిక పాట్రిక్‌ (రేస్‌ కార్‌ డ్రైవర్‌), 10. కెర్బర్‌ ( టెన్నిస్‌)