కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. అందుబాటులో ఉన్న మంత్రులు,  ముఖ్య నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై కీలక సమావేశం నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులపై చర్చ జరిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్ల ప్రజలలో వ్యతిరేకత తగ్గినదని, తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే అని కాంగ్రెస్ పెద్దలు హామీలు ఇస్తున్న అంశాన్ని స్వయంగా చంద్రబాబునాయుడు ప్రస్తావించిన్నట్లు తెలుస్తున్నది. తద్వారా కాంగ్రెస్ తో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసి, పార్టీ నేతలను కుడా మానసికంగా అందుకు సిద్దం చేసే ప్రయత్నం మొదలు పెట్టారు. గంటకు పైగా జరిగిన ఈ భేటిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం పైననే ద్రుష్టి సారించిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

తెలంగాణలో తమతో పొత్తుల కోసం పలు పార్టీలు ఆసక్తి చూపుతున్నాయని అంటూ పరోక్షంగా కాంగ్రెస్ తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై తెలంగాణలోని పార్టీ నాయకులతో సమాలోచనలు జరిపి, వారిని కూడా అందుకు సంసిద్దులను చేసే బాధ్యతను కొందరు ముఖ్య నాయకులకు అప్పచేప్పిన్నట్లు చెబుతున్నారు. బిజెపి బలహీనం అవుత ఉండటం, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి బిజెపికి సన్నిహితంగా ఉంటూ ఉండడంతో ఇక తమకు కాంగ్రెస్ తో చేతులు కలపడం కన్నా మార్గాంతరం లేదని స్పష్టం చేసిన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ విషయమై స్పష్టమైన వైఖరిని ఇప్పుడిప్పుడే ప్రకటించే అవకాశం లేదు. ముందుగ కాంగ్రెస్ తో చేతులు కలపడానికి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను జీర్ణించుకున్న పార్టీ నేతలను, కార్యకర్తలను సంసిద్దులను చేయించడం పట్ల ద్రుష్టి సారిస్తున్నారు. మరోవంక తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించడాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.