కేసీఆర్‌కి ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం

కేసీఆర్‌కి ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం.. టీఆర్‌ఎస్‌కు ఇదే చివరి ప్రభుత్వం అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావ్‌ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తే ఆయన  ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమవుతోందని ధ్వజమెత్తారు. తాడు, బొంగరం లేని కేసీఆర్‌ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ఏ పార్టీలు విశ్వసించవని స్పష్టం చేశారు.

మజ్లీస్‌ను పట్టుకుని ఊరుగేదామని కేసీఆర్‌ కలలు కంటున్నారని ఎద్దేవా చేసారు. మజ్లీస్‌ని జాతీయ పార్టీగా మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క పెండింగ్‌ ప్రాజెక్ట్‌ కూడా పూర్తి చేయని కేసీఆర్‌ నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డరమని విమర్శించారు.

 దేశానికి ఒక సుప్రీం కోర్టు కాకపోతే.. రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 2019లో రెండు జాతీయ కూటముల మధ్యే యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు 2019కి ఎలాంటి గీటురాయి కావని వివరించారు.