ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని, ప్రజా తీర్పే సర్వోన్నతమైనదని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయాన్ని సాధించడంపై ఆయన కేసీఆర్‌ను, మిజోరం ఎన్నికల్లో గెలిచిన మిజో నేషనల్ ఫ్రంట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో బలమైన రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. బీజేపీ గెలుపుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు విజయం కోసం చేసిన శ్రమను, కృషిని ఆయన అభినందించారు.   

జీవితంలో గెలుపు, ఓటమి సమానమని ఆయన తెలిపారు. విజయాలు సాధించినందుకు కాంగ్రెస్‌ను అభినందిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "కేసీఆర్‌గారూ మీరు ఘన విజయం సాధించారు. అభినందిస్తున్నాను"అని ట్వీట్ చేశారు. అలాగే, మంచి ఫలితాలు సాధించారు అంటూ మిజోరంలో నేషనల్ ఫ్రంట్‌ను ఆయన అభినందించారు. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సంక్షేమ విధానాలను నిరంతరం అమలు చేశాయని ప్రధాని కొనియాడారు. 

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు.   ఎన్నికల్లో గెలిచిన మిజో నేషనల్ ఫ్రంట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో బలమైన రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. బీజేపీ గెలుపుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు విజయం కోసం చేసిన శ్రమను, కృషిని ఆయన అభినందించారు.