రాజకీయంగా దేశ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా ప్రధాన మంత్రిగా అత్యధిక సంఖ్యలో నరేంద్ర మోడీనే తిరిగి కోరుకొంటున్నారు. ఎవ్వరు సర్వే జరిపినా తిరిగి బిజెపి నేతృత్వంలోనే ఎన్డియేకు ఆదిక్యహ్త వస్తుందని, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని స్పష్టం అవుతున్నది. అయితే సీట్ల సంఖ్యలోనే ఒకొక్క సర్వే ఒకొక్క విధంగా చెబుతున్నది. దాదాపు అన్ని సర్వేలు బిజెపి సొంతంగా తిరిగి ఆధిక్యత పొందగలదని, లేదా అందుకు చాల దగ్గరకు రాగాదలదని చెబుతున్నాయి. ‘
అయితే గత జులైలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో మాత్రం తదుపరి ప్రధానిగా మోదీకి ప్రజాదరణ 49 శాతం ఉన్నట్లు వెల్లడి కాగా, ఆయనకు దగ్గరలో రాహుల్ గాంధీకి ప్రజాదరణ 27 శాతంగా ఉంది. మిగిలిన నాయకులు ఎవ్వరు రెండంకెలకు చేరుకోవడం లేదు. ప్రధాని రేస్‌లో నిలిచిన వీరిద్దరిలో మోదీవైపే ప్రజలు విస్పష్టంగా మొగ్గుచూపగా, కాంగ్రెస్ ట్రంప్ కార్డ్ గా భావిస్తున్న ప్రియాంక గాంధీవైపు కేవలం మూడు శాతం మంది మొగ్గుచూపారు. భారత ఉత్తమ ప్రధానిగా మోదీ తన స్ధానాన్ని పదిలపరుచుకున్నట్లు వెల్లడైనది.
తదుపరి ప్రధానిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీవైపే 23 శాతం అధికంగా ప్రజలు మొగ్గుచూపినా, మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనని ఈ సర్వే వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్ మెరుగైన ఎంపికని 46 శాతం మంది తేల్చిచెప్పారు. మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రత్యామ్నాయమని సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం, ప్రియాంక గాంధీల వైపు ఆరు శాతం మంది మొగ్గుచూపారు. ఇక నాలుగు శాతం ఓట్లతో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు తర్వాతి స్ధానంలో నిలిచారు. ఇక మతపరంగా చూస్తే 47 శాతం ముస్లింలు, 45 శాతం హిందువులు మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్‌ను ప్రతిపాదించారు.