శివరాజ్ సింగ్ రాజీనామా, కాంగ్రెస్ కు మార్గం సుగమం

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తన పదవికి రాజీనామా చేశారు. దానితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది. 230 మంది సభ్యులు గల రాష్ట్ర శాసన సభలో ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించిన అధికారిక ప్రకటన ప్రకారం కాంగ్రెస్ 114 సీట్లు గెల్చుకోగా, బీజేపీకి 109 సీట్లు గెల్చుకోంది. స్పష్టమైన ఆధిక్యతను కాంగ్రెస్ కు రెండు సీట్లు తగ్గాయి. 

అయితే నలుగురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇద్దరున్న బీఎస్పీ, ఒకరున్న ఎస్పీ కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో స్పష్టమైన ఆధిక్యతతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్దపడుతున్నది. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో తాము ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నం చేయడం లేదని చౌహన్ ప్రకటించారు. గవర్నర్ ను  కలసి రాజీనామా లేఖను సమర్పించారు. 

మరోవంక, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత మాయావతి ప్రకటించారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడం కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు.

2013 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓట్ల శాతం 36.4 శాతం నుండి 40.9 శాతంకు పెరగగా, బీజేపీ ఓట్ల శాతం 44.9 శాతం నుండి 41 శాతానికి పడిపోయింది. ఇద్దరి మధ్య ఐదు సీట్లు తేడా ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో 1 కన్నా తక్కువగా మాత్రమే తేడా ఉండటం గమనార్హం. బిజేపికి 5 శాతం ఓట్లు లభించాయి. స్వతంత్రులుగా గెలుపొందిన నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీకి  చెందిన వారే. మారి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మద్దతు దారులుగా భావిస్తున్నారు.