తెలంగాణలో చంద్రబాబుతో మునిగిపోయిన కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ కలిగించాయి. ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా పెద్దగా దిమ్మ తిరిగే షాక్ కలిగించాయి. అనూహ్యంగా హేమాహేమీలు అందరు ఓటమి చెందారు. ఎవ్వరు ఊహించని విధంగా అధికార పక్షానికి ఆధిక్యత తెచ్చి పెట్టారు. 

అసెంబ్లీని రద్దు చేసి, ఎందుకు రద్దు చేసామో చెప్పలేక, వెంటనే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించకుండా సుమారు రెండు నెలల పాటు ఫార్మ్ హౌస్ కె పరిమితమైన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కు చంద్రబాబుతో చేతులు కలపడం ద్వారా బ్రహ్మాండమైన ప్రచార రాష్ట్రాన్ని కాంగ్రెస్ సమకూర్చిన్నట్లు అయింది. \

చివరి వరకు తెలంగాణ ఏర్పాటును అడ్డుకొంటూ వచ్చిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు తొలినుండి `తెలంగాణ వ్యతిరేకి'గానే చూస్తున్నారు. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్న బిజెపికి ఆ విషయం అర్ధమయ్యి బొక్కబోర్లా పడవలసి వచ్చింది. అయినా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోకుండా ఆ పార్టీతో చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. 

అప్పటి వరకు కేసీఆర్ పరిపాలన వైఫల్యాలను, కుటుంభం పాలన, అమలు కానీ ఎన్నికల హామీలు వంటి అంశాలు ప్రజలలో నానుతూ ఉండగా, చందబాబు రంగ ప్రవేశంతో `తెలంగాణ సెంటిమెంట్' 2014 ఎన్నికలలో కన్నా ఎక్కువగా చెలరేగి, ఓటర్లు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కూటమి గెలుపొందితే చంద్రబాబు పెత్తనం వచ్చిన్నట్లే అని, అమరావతి నుండి రిమోట్ పాలన సాగుతుందని కేసీఆర్ చేసిన ప్రచారానికి తెలంగాణ ప్రజలు సుముఖంగా స్పందించినట్లు ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. 

పైగా రాహుల్ గాంధీతో కలసి చంద్రబాబు ప్రచారం చేయడం కాంగ్రెస్ అభిమానులకు సహితం నచ్చిన్నట్లు కనబడటం లేదు. ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు భారీగా నిధులు  సమకూర్చారని,చివరకు ప్రచార ప్రణాళికలు అన్ని చంద్రబాబు రూపొందిస్తున్నారని కధనాలు వెలువడటం సహితం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ కలిగించాయి. 

కాంగ్రెస్ విడిగా పోటీ చేసినా కాంగ్రెస్ ఇచ్చిన పార్టీగా ఆకొద్దొ, గొప్పో ప్రజల అభిమానం పొందే వీలుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వ్యతరేకతను కొంతమేరకు ఉపయోగ పడదని కూడా చెబుతున్నారు. అందుకు అవకాశం లేకుండా చంద్రబాబుతో చేతులు కలపడంతో 2014లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అగెలుపొందలేనటువంటి సీట్లను భారీగా యిప్పుడు కేసీఆర్ గెల్చుకుకున్నారు. ఇదంతా చంద్రబాబుతో చేతులు కలిపిన ఫలితమే అని అర్ధం అవుతుంది. 

మరోవంక జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నాను, కాబోయే ప్రధాన మంత్రిగా ఎవ్వరు ఉంటాలో తానే నిర్ణయిస్తాను అంటూ ప్రచారం చేసుకొంటున్న చంద్రబాబుకుక్ సహితం ఈ ఫలితాలు ఏమాత్రం మింగుడు పడే అవకాశం లేదు. ఈ ఫలితాలు ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఏడాది జరిగే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుంది. 

తెలంగాణ ఎన్నికలలో జోక్యం చేసుకోవడం ద్వారా చంద్రబాబు రాజకీయంగా భారీ ఈమూల్యం చెల్లించుకో వలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ కు దూరంగా  జరగలేని పరిస్థితి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అడుగులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. బిజెపికు దూరమైనా తర్వాత కేసీఆర్ వలె రాష్ట్రంలో ప్రజలకు చేరువ కావడమా పట్ల దృష్టి సారించి ఉంటె పరిస్థితులు మరోవిధంగా ఉండే అవకాశం ఉండెడిది. 

అట్లాగే `పేపర్ టైగర్' గా మిగిలిన తెలంగాణ ప్రజా సమితి నేత కోదండరాం గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం చివరి వరకు సమయం వృద్దా చేయడం కాంగ్రెస్ చేసిన మరో పొరపాటు. ఏర్పాటు  చేయబోయే ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తామని హామీలు  ఇవ్వడం, రాహుల్ గాంధీ వద్దకు తీసుకు వెళ్లి ఆయనతో పాటు మొత్తం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపుకు వస్తున్నారనే అభిప్రాయం కలిగిస్తూ తప్పటడుగు వేశారు. 

ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి కోసం సీట్ల సమయంలోనే అంతర్గతంగా కుట్రలు జరగడం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ కలిగించాయి. ప్రజలతో ఏమాత్రం సంబంధం లేకుండా రాహుల్ గాంధీ వద్ద తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సలహాలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు భావిస్తున్న ఒక మాజీ ప్రభుత్వ అధికారి ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తున్నది. చంద్రబాబుతో ఆ అధికారి రాయబారం నడిపారని కూడా చెబుతున్నారు.