కిరణ్ కుమార్ రెడ్డి పై పోటీకి తమ్ముడు సిద్దం !

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో కీలక అధికార కేంద్రంగా వ్యవహరించిన ఆయన తమ్ముడు కిశోర్ రెడ్డి ఇపుడు సొంత అన్నపై కుడా ఎన్నికలలో పోటీకి సై అంటూ సవాల్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుండి బైటకు వచ్చి, సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్ తో జతగా ఉండి, అన్న నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన కిషోర్ ఇప్పుడు తెలుగు దేశంలో ఉన్నారు.

ఎన్నికల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి రాజకేయంగా తెరమరుగు కావడం, కాంగ్రెస్ కు రాస్త్రంలో భవిష్యత్ కనిపించక పోవడంతో కిషోర్ గత సంవత్సరం తెలుగు దేశం పార్టీలో చేరి అధికార పదవి కుడా పొందారు. అసెంబ్లీ సీట్ పై కుడా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నుండి హామీ పొందారు. ఎన్నికల ముందు కిరణ్ కుమార్ రెడ్డి కుడా తెలుగు దేశం పార్టీలో చేరతారని, ముందుగా తమ్ముడిని పంపారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తాను ప్రాంతీయ పార్టీలలో చేరబోనని స్పష్టం చేస్తూ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానితో సొంత నియోజకవర్గంలో తమ్ముడు పోటీ చేస్తే పరిస్థితి ఏమిటనే ప్రశంలు తలెత్తాయి. ‘

అటు అన్న కాంగ్రెస్‌లో.. ఇటు తమ్ముడు టీడీపీలో ఒకే ఇంట్లో రెండు కుంపట్లు పెట్టినట్లుగా. చేరో గూటికి చేరుకావడంతో రాజకీయంగా ఆసక్తి కలుగుతున్నది.  రానున్న ఎన్నికల్లో  తాను  పీలేరు నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్తం చేస్తూ ఒకవేళ అన్న ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసినా ఆయనపై కుడా పోటీకి సిద్దమని స్పష్టం చేసారు. “నా మీద ఎవ్వరు పోటీ చేస్తారో నాకు అనవసరం. నేను మాత్రం టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తాను” అని కిషోర్ స్పష్టం చేసారు. ఈ ప్రకటనతో వారి కుటుంభం అభిమానులలో కలవరం కలుగుతున్నది.