ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌ల్లో బిజెపి, రాజస్థాన్ లో కాంగ్రెస్, తెలంగాణలో కేసీఆర్

తెలంగాణ, రాజస్థాన్ లలో పోలింగ్ పూర్తి కావడంతో ఐదు రాష్ట్రాలలో పోలింగ్ పక్రియ పూర్తయింది. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమీషన్ గత నెల 12 నుండి విధించిన నిషేధం శుక్రవారం సాయంత్రంతో పూర్తి కావడంతో పలు ఏజెన్సీ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. 

ఈ పోల్స్ అంచనాలను గమనిస్తే మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ లలో వరుసగా నాలుగోసారి బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఆధిక్యత లభించగలదని భావిస్తున్నారు. తెలంగాణలో చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్ఎస్‌ తిరిగి అధికారం చెంబెట్టబోతున్నది.  కాగా,మిజోరాం లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అవకాశాలు ఉన్నాయి. 

అయితే ఈ సందార్భంగా కొన్ని ఏజెన్సీలు భిన్నమైన అంచనాలకు కూడా వచ్చాయి. మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ లలో బిజెపి, కాంగ్రెస్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. బీఎస్పీ తో పొత్తు ఏర్పాటు చేసుకోలేక పోవడంతో ఈ మూడు రాష్ట్రాలలో కూడా కాంగ్రస్ పలు స్థానాలను కోల్పోబోతున్నట్లు వెల్లడి అవుతున్నది. 

తెలంగాణలో బిజెపి తన సీట్లను పెంచుకోబుతున్నట్లు స్పష్టం అవుతున్నది. తెలుగు దేశం తో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పెద్దగా లాభపడక పోగా, కొంత ప్రతికూలతను ఎదుర్కొన్నట్లు భావించవలసి వస్తున్నది. అయితే మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తాను నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమికి 65 సీట్లు, టీఆర్ఎస్‌ కు 34 సీట్లు, బిజెపికి 7 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు రావడంతో పాటు ఏడుగురు వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.