శరద్ యాదవ్ వాఖ్యలు ‘‘దారుణ అవమానం’’ ..మండిపడ్డ వసుంధర

 ఎన్నికల ప్రచార సభలో శరద్‌ యాదవ్‌ మాట్లాడుతూ  ‘వసుంధరకు కొంత విశ్రాంతి ఇవ్వండి.. ఆమె అలిసిపోయారు.. ఇదివరకు సన్నగా ఉండే ఆమె ఈ మధ్య బాగా లావయ్యారు..’ అంటూ   జెడి(యు) బహిష్కృత నేత శరద్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనకు ‘‘దారుణ అవమానం’’ జరిగిందంటూ మండిపడ్డారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయన ఇలా వ్యాఖ్యానించడం షాక్‌కి గురించేసిందని ఆమె పేర్కొన్నారు. 

మొత్తం మహిళలనే అవమాన పరచే విధంగా ఈ వాఖ్యలు ఉన్నాయని అంటూ భవిష్యత్ లో మరెవ్వరు ఇటువంటి భాష ఉపయోగించకుండా ఎన్నికల కమీషన్ తగు చర్య తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.   

తన అనుచిత వాఖ్యలపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో శరద్ యాదవ్ మాటమార్చే ప్రయత్నం చేశారు. అవమానకరమైన పదజాలంతో ఉన్న తన వ్యాఖ్యలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు.  ‘‘సరదాగానే’’ అలా మాట్లాడాననీ.. ఆమె చాలాకాలంగా తనకు తెలిసిన వ్యక్తేనని చెప్పుకొచ్చారు.