రాష్ట్రాలలో సిద్దమైన బిజెపి `వార్ రూమ్’లు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా, జమిలి ఎన్నికలు జరిగినా-విడివిడిగా జరిగినా పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తున్న బిజెపి ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన `వార్ రూమ్’లను మొదటి సారిగా దాదాపు అన్ని రాష్త్రాల రాజధానులలో కుడా ప్రారంభిస్తున్నది. ఇదివరలో కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో ఆ పార్టీ `వార్ రూమ్’ పనిచేస్తూ ఉండేడిది. బిజెపి విస్తృతమైన ఎన్నికల సన్నాహక యంత్రాంగాన్ని ఢిల్లీలో ఏర్పరచుకొంది.

అయితే దేశంలో రాష్త్రాల రాజధానులలో కుడా `వార్ రూమ్’లను ఏర్పాటు చేస్తున్న మొదటి రాజకీయ పార్టీ బిజెపి అని చెప్పవచ్చు. ఆగష్టు 15 నాటికే ఇవి చాల రాష్ట్రాలలో పనిచేయడం ప్రారంభించాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వీటిని బలోపేతం చేస్తుంటారు. ఢిల్లీలో ఉన్న పార్టీ కేంద్ర `వార్ రూమ్’ లో 300 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. పార్టీ మాజీ కేంద్ర కార్యాలయం ఉన్న 11, అశోక రోడ్ లోనే ప్రతి రాష్త్రానికి సంబంధించిన ఎన్నికల సమాచారంను సేకరిస్తున్నారు.

ఎన్నికల యంత్రాంగాన్ని వికేంద్రికృతం కావించి, స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగిన విధంగా వ్యూహాలను ఎర్పర్చుకోనేందుకే రాష్త్రాలలో `వార్ రూమ్’ల ఏర్పాటును చేపట్టారు. చివరకు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఏమి జరుగుతుందో పర్యవేక్షించే విధంగా పార్టీ యంత్రాంగాన్ని రూపొందిస్తున్నారు.

కేవలం జాతీయ నాయకుల ఇమేజ్, ఎన్నికల ప్రభంజనలపై ఆధార పడకుండా దాదాపు ప్రతి వాటర్ వద్దకు వ్యక్తిగతంగా చేరుకోవడం ద్వారా పార్టీకి క్షేత్ర స్థాయిలో మద్దతును కూడాదీసుకోనేందుకు బృహత్తర ప్రయత్నం చేస్తున్నారు. అందుకు దేశంలో మరే రాజకీయ పార్టీకి లేని విధంగా బ్రహ్మాండమైన కార్యకర్తల సమూహాన్ని ఏర్పరచు కొంటున్నారు.

బిజెపి వర్గాల సమాచారం మేరకు ఒకొక్క రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాస్త్రాలలోని `వార్ రూమ్’లు పనిచేస్తాయి. వీటి రూపురేఖలను సహితం పార్టీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుంది. ప్రతి 500 శక్తీ కేంద్రాలకు (రెండు, మూడు పోలింగ్ బూత్ లకు కలిపి ఒక శక్తీ కేంద్ర) ఒక కాలింగ్ ఏజెంట్ చొప్పున కార్యకర్తలు ఉంటారు. వీరితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వారికి ఒక సుపరవైజర్ ఉంటారు. లాప్ టాప్ లు, కలర్ ప్రింటర్, సర్వర్ గది, 10 యంబిపీఎస్ స్పీడ్ తో ఇంటర్ నెట్ సదుపాయం, సమావేశం/శిక్షణ గది, ఒక చిన్న క్యాబిన్.... ఇట్లా సదుపాయాలు ఉంటాయి.

పార్టీ సాధారణ రాజకీయ కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఇవి పనిచేస్తూ ఉంటాయి. వోటర్లకు సంబంధించిన డేటా సేకరించడం, ప్రచార సామగ్రి తాయారు చేయడం, సీనియర్ పార్టీ నాయకుల పర్యటనలు, మీడియా ప్రచారాన్ని పర్యవేక్షించడం వంటి విధులను నిర్వహిస్తుంటారు. అదే విధంగా సోషల్ మీడియాను పెద్ద ఎత్తున ఉపగ్యోగించు కోవడాన్ని సహితం ఇక్కడి నుండే పర్యవేక్షిస్తుంటారు.