భద్రత, రక్షణలో తిరుపతికి రెండో స్థానం

దేశంలో భద్రత, రక్షణ ఉన్న నగరాల్లో తిరుపతికి రెండో స్థానం వచ్చింది. అంతేకాదు ఏపీ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో తిరుపతికి రెండో స్థానం చోటు దక్కింది. భద్రత, రక్షణ విషయంలో దేశంలోని 111 నగరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పరిశీలించగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తిరుపతికి రెండో స్థానం ప్రకటించింది. ఇప్పటికే తిరుపతికి నివాసయోగ్యమైన నగరాల్లో నాలుగో స్థానం లభించిన విషయం తెలిసిందే.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నిర్వహణ, హోటళ్లు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్, ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు, భక్తులకు అత్యంత భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. భద్రత, రక్షణలో తిరుపతికి రెండోస్థానంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.