వివాదాస్పద చంద్రస్వామి సిఐఏ ఏజెంట్ !

ఇందిరా గాంధీ హయం నుండి పివి నరసింహారావు కాలం వరకు భారత రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన వివాదాస్పద సాధువు చంద్రస్వామి కాంగ్రెసేతర ప్రభుత్వాలను పడగొట్టడంతో దుష్ట పన్నాగాలను అమలు పరిచారని అందరికి తెలిసిందా అతను సిఐఏ ఏజెంట్ అంటా తాజాగా ఒక విస్మయం కల్గించే కధనం వెలువడింది. ఈ కధనాన్ని విదేశాలలో భారత ప్రభుత్వ నిఘా సంస్థగా పేరొందిన రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ కు గతంలో అధిపతిగా వ్యవహరించిన విక్రమ్ సూద్ తన తాజా పుస్తకం "ది ఆన్ ఎండింగ్ గేమ్" లో పేర్కొనడంతో ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.

దేశంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ సారధి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని పడగొట్టడంతో చంద్రస్వామి కీలక పాత్ర వహించారని అందరికి తెలిసిందే. పైగా విపి సింగ్ ప్రధాని కాకుండా చేయడం కోసం కిట్స్ బ్యాంక్ లో ఆయనకు కొన్ని ఖాతాలున్నట్లు నకిలీ పత్రాలను కూడా సృష్టించారు. అయినా ఆయన ప్రధాని కాగలగడం వేరే సంగతి.

యువజన కాంగ్రెస్ నేతగా ప్రారంభమై తాంత్రిక్ స్వామిగా పెరూపొంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఉన్నత వర్గాలలో విశేషమైన పలుకుబడి సంపాదించారు. వివాదాస్పదమైన అనేక కార్యకలాపాలు నిర్వహించారు. శత్రుపక్షాల వారిని తుదముట్టించడం కోసం తాంత్రిక పూజలు కూడా జరిపేవారని అంటుండేవారు. పలు అక్రమ కార్యకలాపాలు చేబడుతూ రాజ్యాగా వ్యవస్థలకు అతీతంగా హోదా అనుభవించేవారు.

విక్రమ్ సూద్ తన తాజా గ్రంథంలో పలు దశాబ్దాల పాయలు సిఐఏ, కెజిబిల ఆటలకు క్రీడాస్థలంగా భారత్ మారినదని పేర్కొన్నారు. చంద్రస్వామి, అతని సహచరుడు మామాజీ సౌదీ కోటీశ్వరుడు అద్నాన్ ఖశోగ్గితో సన్నిహితంగా స్నేహం జరిపేవారు. అతని సహాయంతో బోఫర్స్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలలో రాజీవ్ గాంధీని గెలిపించే ప్రయత్నం చేసాడు.

సిఐఏ కు పార్ట్ టైమే ఏజెంట్ గా పనిచేస్తున్న తన అల్లుడు లారి కోల్బ్ కు స్వామిని ఖశోగ్గి పరిచయం చేసాడు. న్యూయార్క్ లోకి విలాసవంతమైన ఒక భవనంలో స్వామికి వసతి ఏర్పాటు చేసేవాడు. కువైటీ నుండి ప్రచురించే అరబ్ టైమ్స్ పత్రికలో సెయింట్ కిట్స్ కధనాలు ప్రచురించేటట్లు చూడటం కోసం కోల్బ్ విశేషంగా ప్రయత్నం చేసాడు.

విపి సింగ్ ను గద్దె దింపి చంద్రశేఖర్ ను ప్రధానిగా చేయడంలో కూడా చంద్రస్వామి కీలక పాత్ర వహించాడు. చంద్రస్వామి అక్రమ కార్యకలాపాల పట్ల ఆందోళన చెందిన పివి నరసింహారావు తాను ప్రధానిగా ఉన్న సమయంలో అతనిని దూరంగా ఉంచే ప్రయత్నం చేసారని సన్నిహితులు చెబుతున్నారు.

10 వార్త పత్రికలు, ఒక న్యూస్ ఏజెన్సీ కి కెజిబి నిత్యం నిధులు సమకూర్చేదని, వారి ప్రయోజనాల మేరకు వేల కొద్దీ కథనాలను అవి ప్రచారంలోకి తెచ్చేవని సూద్ చెబుతున్నారు.