కుటుంబ రాజకీయం, కులతత్వంలలో కాంగ్రెస్ జిరాక్స్ కాపీ టీఆర్‌ఎస్‌

కుటుంబ రాజకీయం, కులతత్వం, ఓటే బ్యాంకు రాజకీయాలలో చంద్రశేఖరరావు నాయకత్వం లోని టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ పార్టీ జిరాక్స్ కాపీ మాత్రమె అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజామాబాదు, మహాబుబానగర్ లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన ఎటువంటి వాగ్దానాన్ని కుడా అమలు చేయలేదని ద్వజమెత్తారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. చంద్రబాబు, సోనియాల దగ్గర శిక్షణ పొందిన వ్యక్తని అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లలేడని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.

‘‘దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒక్క కుటుంబం దేశంలో తిష్టవేసుకుని కూర్చొంది. నవ తెలంగాణలో కూడా గత నాలుగున్నరేళ్లుగా ఒకే కుటుంబ తిష్ట వేసుకుని కూర్చొంది” అంటూ కుటుంభ రాజకీయాలను తూర్పార బట్టారు. తెలంగాణా ప్రజలు  అన్యాయానికి వ్యతిరేకంగా, అభివృద్ధి కోసం పోరాడారని, అయితే ఒక కుటుంబం అది మరిచి కుల రాజకీయాలను తీసుకొచ్చిందని కెసిఆర్ ప్రభుత్వాన్ని దయ్యబట్టారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే అని అంటూ అవి రెండూ wwwfలో జరిగే నకిలీ పోరాటం వంటిదే అంటూ నిప్పులు చెరిగారు. రెండూ కుటుంబ పార్టీలే. టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అంటోంది. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కూడా ఇదే చేస్తోంది. ఇక్కడున్న నాయకులకు ఏది పడితే అది మాట్లాడటం అలవాటైపోయిందని అంటూ విమర్శలు కురిపించారు.

ఇక్కడ పాలించే వాళ్ల పాదాల దగ్గర పడి ప్రజలు ఉండాలని వారు కోరుకుంటున్నారని చెబుతూ స్వాభిమానం కోసం పోరాడిన మీరు ఎవరి పాదాల వద్దా కూర్చొనే అవసరం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పిలుపిచ్చారు.

ఒక్క కాంగ్రెస్స్ అభ్యర్ధిని కుడా గెలిపించకండి


‘‘ గత ఐదేళ్లలో మీ ఆంక్షాలు, కలలు నెరవేరాయా? మీరు స్వప్నాలు ఫలించాయా? టీఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుందా? తెలంగాణను సర్వ నాశనం చేశారా? లేదా? మీ భవిష్యత్‌ను నాశనం చేశారా లేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది తెలంగాణ నవ యువకుల రుణం తీర్చుకునే అవకాశం అని పేర్కొంటూ ఒక్క కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా గెలవకుండా చూడాల్సిన బాధ్యత ఓటర్లదే అని స్పష్టం చేసారు.

కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. ఇప్పుడు వారు తన్నుకుంటుంటే చూస్తూ ఆనందిస్తోంది. ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాలను శాంతియుత పరిస్థితుల మధ్య విభజించి ఇచ్చారు. అవి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. తెలంగాణ కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అన్ని అనేక పథకాలను తీసుకొచ్చింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏమేం తెచ్చారో అంతకంటే ఎక్కువ బిజెపి ష్ట్రానికి ఇస్తుంది.’ అంటూ కాంగ్రెస్‌,  టీఆర్‌ఎస్‌పై ప్రభుత్వాలపై విరుచుకుపడిన మోదీ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.