అక్బరుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌కు పోవాలి

హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌కు పోవాలనీ సీఎం స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేసారు. మలక్‌పేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్ర ప్రచారంలో భాగంగా మూసారంబాగ్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటూ కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తాని చెప్పి కంగారు తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఖతం, కాంగ్రెస్‌ గతం, ఎంఐఎం హతం చేయడం తథ్యమని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైద్రాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని స్వామి పరిపూర్ణనంద ప్రకటించారు.

మలక్‌పేటలో కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతున్న మజ్లిస్‌ అభ్యర్థి బలాలకు తగిన బుద్ధి చెప్పాలని స్వామి పిలుపిచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే నేరుగా మజ్లిస్‌కు వేసినట్లేనని హెచ్చరించారు.

నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఎక్కడ కూడా బాంబ్‌ పేళ్లుల్లు జరగలేదని, బాంబ్‌ పేల్చేవారిని దేశ సరిహద్దుల్లోనే పేల్చేశారని గుర్తు చేసారు. తెలంగాణలో బీజేపీ గెలుపు చారిత్రక అవసరమని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 7న జరుగబోయే పోలింగ్‌ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కమలం గుర్తుకు ఓటే వేసి ఆలె జితేంద్రను గెలిపించాలని కోరారు.