ఒవైసీ సోదరుల్ని దేశం నుంచి బహిష్కరిస్తాం

‘ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. ఒవైసీ సోదరుల్ని తెలంగాణ నుంచే కాదు దేశంలోంచే బహిష్కరించి చూపిస్తాం’ అని బిజెపి గోషామహల్‌ అభ్యర్థి రాజాసింగ్‌లోథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా సీఎం ఎవరున్నా తమ చెప్పుచేతల్లోనే నడుస్తారంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్‌ మండిపడ్డారు.

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కొందరు సీఎంలు తమ చెప్పుచేతల్లో నడుచుకుంటూ వచ్చారని పేర్కొన్న ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి జైలు రుచి చూపించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించ లేదని ఎద్దేవా చేసారు. ఒవైసీ సోదరుల్ని భుజాలపై మోసుకుంటూ వస్తోన్న కేసీఆర్‌కు ఇప్పటికైనా బుద్ధి రావాలని రాజాసింగ్‌ హితవు చెప్పారు.

కాగా, కారు స్టీరింగ్ తమచేతిలోనే ఉందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. ఇలా ఉండగా, శాసనసభ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేయకుండా ఉండటానికి ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్ తో రూ.500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు ఆరోపించారు. శంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్న ఎంఐఎం ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, భైంసా నియోజకవర్గాలో పోటీ చేయకపోవడానికి ఇదే కారణమని ఆరోపించారు.