చింతమనేని మళ్ళి గెలిస్తే తెలంగాణ వెళ్ళిపోతా !

దెందులూరు ఎంఎల్ఎ చింతమనేని ప్రభాకర్‌పై సిని నటి అపూర్వ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎంఎల్ఎ తమకు నరకం చూపిస్తున్నాడని, మళ్లీ అతనే గెలిస్తే తమ ఆస్తులన్నీ అమ్ముకుని తెలంగాణ వెళ్లిపోతామని ఆమె ఆవేధన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అపూర్వ ఓ ‘యూట్యూబ్’ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయా లపై నాకు అవగాహన ఉంది. దెందులూరులో మాది రాజకీయ నేపథ్య కుటుంబ. మాది కమ్మ కులమే… కానీ, నాకు కులగజ్టి లేదు. కులాన్ని పెద్దగా పట్టించుకోను. కానీ, టిడిపికే ఓట్లు వేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవాలని దేవుడిని ప్రార్థించా” అని చెప్పుకొచ్చారు.

తమ నియోజవర్గమైన దెందులూరులో చింతమనేని విజయం సాధిస్తే ఎంతో సంతోషించానని చెప్పారు. అయితే తాము ఓట్లేసి గెలిపించిన ఆ ఎంఎల్ఎనే ఇప్పుడు తమకు నరకం చూపిస్తున్నాడని, ఆయన వల్ల ఎన్నో కష్టాలు పడ్డానని ఆమె వాపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే గెలుపొందితే తాను ఆస్తులు అమ్ముకుని తెలంగాణ వెళ్లిపోతానని స్పష్టం చేసారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ భద్రత ఉందని భరోసా వ్యక్తం చేసారు.

తన వ్యక్తిగత కారణాల వల్లే సినిమాలకు దూరంగా ఉన్నానని చేలుపుతూ తన తల్లి గుండె జబ్బుతో బాధపడుతున్నారని, ఆమె బాగోగులు చూసుకునే బాధ్యత తనదే కావడంతో అవకాశాలు వస్తున్నా నటించడం లేదని చెప్పారు. తల్లి ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తానని ఆమె తెలిపారు.