కాంగ్రెస్ కూటమికి రెబెల్స్ బెడద

కాంగ్రెస్‌తో సహా కూటమిలోని అన్ని పార్టీలకూ రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. అధికార టిఆర్‌ఎస్ పార్టీలోనూ ఒక మేరకు కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఉంది. టికెట్ ఆశించిన వారు భంగపడినవారిలో కొద్దిమంది ఇతర పార్టీల బిఫాంలను పొంది పోటీ చేయగా, మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కొద్దిమంది రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ల చివరి రోజున రెబల్స్ నామినేషన్లు గణనీయ సంఖ్యలోనే దాఖలయ్యాయి. దాదాపు 40 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్ధులు రెబెల్స్ బెడదను ఎదుర్కొంటున్నారు.

మరోవంక ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు చర్చనీయాంశమైంది. మిత్రపక్షాలైన తెలుగుదేశం, తెలంగాణ జన సమితి పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కూడా తన అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో ఎనిమిది (మిర్యాలగూడ, దుబ్బాక, వరంగల్ ఈస్ట్, అంబర్‌పేట్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూర్, స్టేషన్ ఘన్‌పూర్) చోట్ల తెలంగాణ జన సమితి కూడా పోటీ చేస్తున్న స్థానాలు ఉండగా మరొకటి తెలుగుదేశం పోటీ చేస్తున్న (పటాన్‌చెరు) స్థానం. మరోవైపు జనసమితి కూడా తెలుగుదేశంకు కేటాయించిన రెండు స్థానాల్లో (మహబూబ్‌నగర్, అశ్వారావుపేట) పోటీచేస్తోంది. ఈ రకంగా మొత్తం పన్నెండు స్థానాల్లో కూటమిలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీచేస్తున్నట్లయింది. కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రకారం కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ అదనంగా ఆరు స్థానాల్లో కలిపి మొత్తం 100 చోట్ల పోటీ చేస్తోంది.

కాంగ్రెస్ లో రెబెల్స్ ను బుజ్జగించడం కోసం పార్టీ ఒక కమిటీని వేసింది.  కాంగ్రెస్ పార్టీలో రెబల్ అభ్యర్థులతో ఓట్లు చీలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. టిఆర్‌ఎస్ పార్టీలో సైతం రెబల్స్ బెడద ఉంది. సికింద్రాబాద్ స్థానం నుంచి పద్మారావుగౌడ్ అధికారిక అభ్యర్థిగా పోటీ చేస్తుండగా గజ్జెల నగేశ్ రెబల్‌గా పోటీ చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికారిక అభ్యర్థిగా దానం నాగేందర్ ఉండగా రెబల్ అభ్యర్థిగా మన్నె గోవర్ధన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కోదాడలో అధికారికంగా బొల్లం మల్లయ్య యాదవ్‌ను టిఆర్‌ఎస్ నిలబెట్టగా శశిధర్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేస్తున్నారు.

నియోజకవర్గాల వారి కూటమిలో రెబల్ అభ్యర్ధులు : సికింద్రాబాద్- బండ కార్తీక రెడ్డి. ఖైరతాబాద్- రోహిన్ రెడ్డి, ముషీరాబాద్- నగేష్ ముదిరాజ్, మేడ్చల్- జంగయ్య యాదవ్,
స్టేషన్‌ఘన్‌పూర్- విజయ రామారావు, నారాయణపేట- శివకుమార్ రెడ్డి, దేవరకద్ర- ప్రదీప్‌కుమార్ గౌడ్, చెన్నూరు- బోడ జనార్ధన్, సూర్యాపేట- పటేల్ రమేష్ రెడ్డి, పరకాల- వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి- -సుభాష్ రెడ్డి, ఖానాపూర్- హరి నాయక్, తుంగతుర్తి- డాక్టర్ వడ్డేపల్లి రవి, పెద్దపల్లి- జి.సురేష్‌రెడ్డి, చేతిధర్మయ్య, వరంగల్- తూర్పు అచ్చ విద్యాసాగర్,, గాయత్రి రవి, గాదె ఇన్నయ్య.

వరంగల్- పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ముథోల్- నారాయణరావు పటేల్, విజయ్‌కుమార్ రెడ్డి, బోథ్- అనిల్‌జాదవ్, ధర్మపురి- మద్దెల రవీందర్, కోరుట్ల- జ్యోతి, ఇల్లందు- ఊకె అబ్బయ్య, వెంకటేశ్వరు +అరుగురు, వైరా- లవ్‌డియా రాముల్‌నాయక్, అశ్వరావుపేట- సున్నం నాగమణి, మహబూబ్‌నగర్- సయ్యద్ ఇబ్రహీం, సురేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (తెలంగాణ ఇంటిపార్టీ).

 పఠాన్‌చెరు- గాలి అనిల్, బాల్‌రెడ్డి, సఫన్‌దేవ్, శశికళ, యాదవరెడ్డి, ఎడ్ల రమేష్, కె.సత్యనారాయణ, నారాయణ్‌ఖేడ్- నగేష్ శెట్కర్, మెదక్- శశిధర్ రెడ్డి, సిద్ధిపేట- తాడూరి శ్రీనివాస్ గౌడ్, చంద్రం, ప్రభాకర్ వర్మ, వహిద్‌ఖాన్, యాదగిరి, మిర్యాలగూడ- అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి వడ్డేపల్లి- సుభాష్‌రెడ్డి, బాన్సువాడ- మాల్యాదిరెడ్డి, శేరిలింగంపల్లి- భిక్షపతి యాదవ్, చేవెళ్ల- వెంకటస్వామి, షాద్‌నగర్- శంకర్‌రావు, ఇబ్రహీంపట్నం- మల్‌రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్- చంద్రశేఖర్, ఆంథోల్- నారాయణరావు.