ఎయిర్ పోర్ట్ లో దాడి సూత్రధారుడు చంద్రబాబే : జగన్

గత నెల 25న విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడికి సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని తీవ్రంగా ఆరోపిస్తూ అటువంటి దాడులకు భయపడి వెనుకడుగు వేసే పిరికివాడిని తాను కాదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. దాడి జరిగిన తర్వాత తిరిగి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద జరిగిన మొదటి బహిరంగ సభలో మాట్లాడుతూ జరిగిన దాడి కుట్ర కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

జేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ గత మార్చి నెలలో తెగదెంపులు చేసుకుంది. అప్పటికే ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన రావడంతో నన్ను చంపేందుకు పథకం రచించారు. ఓ సినీ నటుడిని తీసుకొచ్చి ఆపరేషన్ గరుడ పేరుతో స్క్రిప్టు చదివించారు. దానికి ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో బీజేపీ రాష్ట్రంలో అనిశ్చితి రగిల్చి టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తోందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారని ద్వజమెత్తారు.

రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగబోతోందని శివాజీతో చెప్పించారు. కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్‌పోర్టులో దాడి చేసి నన్ను చంపేస్తే బాబు ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో ఆపరేషన్‌ గరుడలో చెప్పినట్టే జరగిందని ప్రచారం చేస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు వివరించారు.

రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ములేకనే అంతమెందించాలని చూశారని మండిపడ్డారు. టీడీపీ అరాచక పాలనలో అన్యాయానికి గురౌతున్న ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెబుతూ ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి చం‍ద్రబాబు ఓర్వలేకపోయాడనీ, అందుకే తనపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. చంద్రబాబు లాంటి నక్క జిత్తుల మనిషి ప్రపంచంలో మరొకరు ఉండరని వ్యాఖ్యానించారు. 

పాదయాత్ర చేస్తూ ఆగస్టు నెలలో విశాఖ జిల్లాలో తాను అడుగుపెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయని, తనపై దాడి జరిగిన అనంతరం సీసీ కెమెరా ఫుటేజీలపై ఆరా తీయగా మూడు నెలల నుంచి అక్కడ కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నారని తెలిపారు. ఇదంత కుట్ర కాదా.. బాబూ అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోకి కత్తులు ఎలా వచ్చాయని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 

‘బాబు సన్నిహితుడైన హర్షవర్ధన్‌ చౌదరి రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి నాపై దాడి చేశాడు. దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలని చూశాడు. ఘటన జరిగిన గంటలోపే రాష్ట్ర డీజీపీ, మంత్రులు మీడియా మందుకొచ్చి హత్యాయత్నం చేసింది జగన్‌ అభిమానే అని ప్రకటించారు. అభిమాని అయితే.. దాడి చేస్తారా’ అని ప్రశ్నించారు.

 దాడి జరిగిన అనంతరం వీఐపీ లాంజ్‌లో నిందితుడి వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ఎలాంటి లేఖ దొరకలేదని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఘటన జరిగిన 10 గంటల తర్వాత డీజీపీతో చెక్కుచెదరని, ఎక్కడా మడతలు పడని లేఖను మీడియాకు చూపించారని గుర్తు చేశారు. జరిగిన ప్రతి సంఘటనలో చంద్రబాబు నాయుడు కక్షసాధింపు ధోరణి వెల్లడి అవుతుందని పేర్కొన్నారు.

ఎందుకని ఇప్పటి వరకు ఈ కేసులో టిడిపి నేత అయిన ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ అధినేత హర్షవర్ధన్ చౌదరిని పోలీస్ లు విచారించాలేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, ఆయన మనుష్యులే దోషులైతే వారే సిట్ ద్వారా విచారణ జరిపించి, తీర్పు ఇవ్వడానికి సిద్దపడ్డారని ఎద్దేవా చేసారు. అందుకు తాము ఒప్పుకోనకుండా స్వతంత్ర విచారణ జరగాలని కోరితే రాష్ట్రంలో సిబిఐ స్వతంత్రంగా పనిచేయకుండా అనుమతిని ఉపసంహరించు కున్నారని జగన్ పేర్కొన్నారు.