కెసిఆర్ పై బిజెపి మహిళానేత ఆకుల విజయ !

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి ఆయనపై బిజెపి అభ్యర్ధిగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ పోటీచేయనున్నారు. గత ఎన్నికలలో ఆమె కెసిఆర్ కుమారుడు కేటి రామారావుపై సిరిసిల్లలో పోటీ చేసారు.

చెన్నూరు (ఎస్సి) నుండి అందుగుల శ్రీనివాసరావు, జహీరాబాద్ (ఎస్సి) నుండి జనం గోపి, జూబ్లి హిల్స్ నుండి శ్రీధర్ రెడ్డి, సనత్ నగర్ నుండి బవర్ లాల్ వర్మ, పాలకుర్తి నుండి సోమయ్య గౌడ్, నర్సంపేట్ నుండి ఎడ్ల అశోక్ రెడ్డి లను అభ్యర్ధులుగా బిజెపి ప్రకటించింది.