చేపట్టిన పదవికే వన్నెతెచ్చిన వాజపేయి

వాజ్‌పేయి ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాళులు అర్పించారు. భారత దేశం గొప్ప రత్నాన్ని కోల్పోయిందని చెబుతూ ఆయన అధికార, ప్రతిపక్షంలో ఉన్నా ఒక నైతిక విలువలతో,  సభలో వెటరన్ పార్లమెంటేరియన్‌గా పేరుతెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. మూడుసార్లు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఎదిగినకొద్ది ఒదిగి ఉండమనేటువంటి సామెతకు వాజ్‌పేయి నలువెత్తు నిదర్శనమని తెలిపారు. ప్రధానిగా భారత దేశానికి గ్రామీణ ప్రాంతం నుంచి నేషనల్ హైవేస్‌వరకు సడక్ యోజన పేరుతో లింక్ రోడ్లు, స్వర్ణ ఛతుర్భుజి, నదుల సంధానం చేసిన గొప్ప నాయకుడని కన్నా కొనియాడారు.