ఎన్టిఆర్ ఇమేజ్ కోసమై అభ్యర్ధిగా నందమూరి సుహాసిని !

తెలంగాణ ఎన్నికలలో నేరుగా తెలుగు దేశం పార్టీ అధినేతగా ప్రజలను వోట్లు అడిగే ధైర్యం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయలేక పోతున్నారు. ఓటు కోసం నోట్ల కేసు తర్వాత అర్ధంతరంగా హైదరాబాద్ ను విడిచి పెట్టి వెళ్ళిన తర్వాత తెలంగాణాలో పర్యటనకు సాహసింపలేక పోతున్నారు. రెండేళ్ళ క్రితం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో ఇన్ చార్జ్ గా కుమారుడు నారా లోకేష్ ను రంగంలోకి దింపి, ఒక్క డివిజన్ కుడా గెలుచుకోలేక బొక్క బోర్ల పడిన చంద్రబాబు, ఆ తరవాత లోకేష్ ను హైదరాబాద్ లో ఉండనీయకుండా కనీసం ఎమ్యెల్యే కుడా కాకుండా తన మంత్రివర్గంలో చేర్చు కున్నారు. అప్పటి నుండి ఎక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నా ప్రచారానికి కుడా పంపడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయంగా మనుగడ కాపాడు కోవాలి అంటే తెలంగాణలో కుడా ఉనికి కాపాడుకోవడం అవసరమని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. అందుకోసం మొదటగా కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకున్నారు. పైగా, సొంతంగా టిడిపి అభ్యర్ధులకు ప్రచారం చేసే సాహసం చేయలేక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి చివరి రోజులలో హైదరాబాద్ సివారులలో రోడ్ షో లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఇక్కడ తెలుగుదేశం ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు పట్ల ఇక్కడ ప్రజలలో ఉన్న అభిమానాన్ని ఉపయోగించుకొనే ప్రచారం చేస్తున్నారు.

అందుకోసం కుక్కటపల్లి నుండి స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయిస్తున్నారు. వివాహం అనంతరం కాకినాడలో నివాసం ఉంటున్న ఆమెకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు. ఆమెను తీసుకు వచ్చి ఇక్కడ పోటీ చేయించి, సీమాంధ్ర ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఆమె పేరును చివరి రోజులలో తెరపైకి తీసుకు వచ్చారు.

అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సుహాసినికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తుండటంతో అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన సెంటిమెంట్ ను తెసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పించడం ద్వారా 2019 ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో కుడా ప్రయోజనం పొందాలని ఎత్తుగడ వెతున్నారు. కాని అక్కడ ఈ కుటుంభానికి సీట్లు ఇవ్వడానికి సిద్దంగా లేరు. ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే రెండో అభ్యర్థి సుహాసిని కావడం గమనార్హం.

మరోవంక, సినీనటుడు బాలకృష్ణను తెలంగాణలో ప్రచారం చేయించనున్నారు. గత నెలలో ఖమ్మం జిల్లా మధిరలో జరిపిన ప్రచారంలో విశేష స్పందన లభించడంతో ప్రచారం భారం అంతా ఆయనపై వేస్తున్నారు. నవంబర్ 20నుండి ఆయన పదో రోజుల పాటు ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. శేరిలింగపల్లి సీటును పార్టీకి సంబంధం లేని భవ్య ఆనందప్రసాద్ కు బాలకృష్ణ సిఫార్స్ పైననే కేటాయించారని అంటున్నారు. దానితో స్థానికి తిదిపిలోనే కాకుండా, స్థానికంగా బలం గల కాంగ్రెస్ లో కుడా తిరుగుబాటు చెలరేగి, తిరుగుబాటు అభ్యర్ధులుగా రెండు పార్టీల నుండి పోటీ చేస్తున్నారు.