సూర్యుడి దగ్గరకు ఇస్రో సాటిలైట్ !

మొత్తం విశ్వంలో శక్తికి పర్యాయపదంగా నిలచిన సూర్య గ్రహం రహస్యాలు ఇంకా మానవాళికి అంతుబట్టకుండానే ఉన్నాయి. సూర్యుడి రహస్యాల చేధనకు ఎప్పటి నుండి పరిశోధనలు జరుగుతున్నా మొన్ననే మానవ చరిత్రలో సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లే పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ఈమధ్యే నాసా లాంచ్ చేసింది.

అంతరిక్ష పరిశోధనలో మరెవ్వరికి తీసిపోని భారతీయ శాస్త్రవేత్తలు కుడా ఇపుడు సుర్యుదివైపి ద్రుష్టి సారించారు. తాజాగా తొలిసారి సూర్యుడి అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా శాటిలైట్‌ను పంపించడానికి ప్రణాళిక రచిస్తున్నది. దీనిపేరు ఆదిత్య-ఎల్1.

భూమికి 15 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఈ శాటిలైట్‌ను ఉంచనున్నారు. ఈ కక్ష్యను హాలో ఆర్బిట్ అంటారు. 2019-2020లలో ఈ ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను లాంచ్ చేయాలని ఇస్రో భావిస్తున్నది. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ ద్వారా ఏపీలోని శ్రీహరికోట నుంచి దీనిని నింగిలోకి పంపనున్నారు.

సూర్యుడిపై సమగ్ర అధ్యయనానికి వీలుగా ఈ శాటిలైట్ ఆరు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లనుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని హాలో ఆర్బిట్ లాగ్రేంగియన్ పాయింట్ 1 (ఎల్ 1)లో ఉండే శాటిలైట్ సూర్యుడిని ఎలాంటి గ్రహణాలు లేకుండా చూసే వీలుంటుంది. అందుకే ఇస్రో ఈ మిషన్‌ను ఆదిత్య-1 నుంచి ఆదిత్య-ఎల్1గా మార్చింది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై అధ్యయనం చేయాలని ఇస్రో భావిస్తున్నది. అయితే శాటిలైట్‌లో పంపుతున్న అదనపు పేలోడ్స్ కరోనాతోపాటు సూర్యుడి ఫొటో స్పియర్, క్రోమోస్పియర్‌లను అధ్యయనం చేయనున్నాయి.