కేరళకు బయలుదేరనున్న ప్రధాని మోడీ

భారీ వర్షాలతో అతలాకుతలమవున్న కేరళలోని పరిస్థితులను స్వయంగా పరిసీలింతి, తగు సహకారం అందించడంకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం అక్కడకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలిగించడం లేదు. మృతుల సంఖ్య వందకు మించి పోయింది. గురువారం నాడే 27 మంది మృతి చెందారు. స్తుండటంతో వరదలు సంభవించాయి.

గత రెండు రోజులుగా సాధారణం కన్నా పది రెట్లు ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని చెబుతున్నారు. ఇళ్ళ గోడలు, కప్పులు కులిపోయి ఉండడంతో సహాయ బృందాలు సహితం నీటిలో వెళ్లి ఆపదలో ఉన్నవారిని కాపాడటం కష్టమవుతున్నది.

‘కేరళలో ఇంతటి భారీ స్థాయిలో వరదలు సంభవించడం దురదృష్టకరం. వరదలపై సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడాను. రాష్ట్రంలోని పరిస్థితులు, సహాయక చర్యలపై చర్చించాం. వరదల పరిస్థితిని సమీక్షించేందుకు నేడు సాయంత్రం కేరళకు బయల్దేరుతున్నా’ అని మోదీ ట్వీట్‌ ద్వారా తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియల అనంతరం ఆయన కేరళకు వెళ్లి, శనివారం ఉదయం రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేయనున్నారు.

ఆగస్టు 8 నుంచి కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. అన్ని నదులు గిపొర్లుతుండటంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాల గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 14 జిల్లాల్లో కుడా రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. కోచి విమానాశ్రయాన్ని ఈ నెల 26 వరకు మూసివేశారు. పాటశాలలకు ఈ నెల 27 వరకు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాల కారణంగా కేరళకు పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు సరిపడా లేకపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయకసిబ్బంది ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల ద్వారా ప్రజలకు సహాయక సామగ్రిని అందజేస్తున్నారు.