వాజపేయి అంత్యక్రియలకు ఇదు లక్షల మంది !

ఈ రోజు జరిగే మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి అంత్యక్రియలలో సుమారు ఇదు లక్షల మంది పాల్గొనవచ్చని ఢిల్లీ పోలీస్ లు అంచనా వేస్తున్నారు. వారిలో ప్రముఖులు, రాజకీయ వేత్తలు, వివిధ అధికార హోదాలలో ఉన్నవారు కుడా ఉంటారు. ఆయన పార్ధివ దేహాన్ని ఉంచుతున్న బిజెపి కార్యాలయం వద్దగానీ, ఆ తర్వాత జరిగే అంతిమ యాత్రలో గాని, రాష్ట్రీయ స్మ్రితి స్థల వద్ద జరిగే అంత్యక్రియలలో గాని వీరు పాల్గొనే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

గత 27 ఏళ్ళలో దేశ రాజధానిలో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు అంత్యక్రియలలో పాల్గొనటం అన్నది జరగక పోవడంతో ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా చూడటం కోసం పోలీస్ లు భారీ కసరత్తు చేతున్నారు. చివరిసారిగా రాజీవ్ గాంధీ హత్యా అనంతరమే అంత భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

20కి పైగా కంపెనీల ఢిల్లీ ప్రత్యేక పోలీస్ దళాలు, పరా మిలిటరీ దళాలతో అంత్యక్రియలు జరిగే స్థలం వద్ద పహారా కాస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో 25 రహదారులలో రాకపోకలను మూసివేసారు. వాటిల్లో వాజపేయి నివాసం ఉన్న కృష్ణ మీనన్ మార్గ, తుగ్లక్ రోడ్, అక్బర్ రోడ్, మాన్ సింగ్ రోడ్, షాజహాన్ రోడ్ వంటివి ఉన్నాయి. ఢిల్లీ గెట్ నుండి రాజఘాట్ వరకు గల మార్గాలు అన్నింటిని మూసివేసారు. ఈ మార్గం అంతా సిసి కెమెరాలను అమర్చారు.

ఇతర ప్రాంతాల నుండి కుడా ప్రత్యేక పోలీస్ దళాలను రప్పించారు. ప్రజలు ట్విట్టర్, పేస్ బుక్ లలో తామిచ్చే ట్రాఫిక్ సలహాలను పాటిస్తూ రోడ్లపైకి రావాలని ఢిల్లీ పోలీస్ లు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.