కెసిఆర్ పాలనపై ‘ప్రజా ఛార్జిషీట్‌’ విడుదల చేసిన బీజేపీ

బీజేపీ తెలంగాణ శాఖ రూపొందించిన ‘టీఆర్‌ఎస్ నయవంచక పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ లోని ముఖ్యాంశాలు :

అధికారంలోకి రాగానే.. విమోచన దినం నిర్వహిస్తామని చెప్పి.. ఎంఐఎం  ఒత్తిడికి లొంగి నిర్వహించలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేస్తామని చెప్పి.. ఎందుకు ఎత్తివేయలేదు. దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చకుండా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మూడెకరాల చొప్పున 5 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 5 వేల దళిత కుటుంబాలకే ఇచ్చారు.

ఇసుక మాఫీయాను అడ్డుకున్నారన్న అక్కసుతో నేరేళ్లలో దళితులను కేసుల్లో ఇరికించి చితకబాదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి.. వాటిని మైనార్జీల 12 శాతం రిజర్వేషన్లతో చేర్చి అమలు చేయకుండా ఆపారు. పేద గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. నాయి బ్రాహ్మణులకు మంజూరు చేస్తానన్న సెలూన్లను మంజూరు చేయలేదు.

అందరినీ ఇబ్బందులకు గురిచేసి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు విడుదల చేయలేదు. ధర్నాచౌక్ ను ఎత్తివేసి ప్రజల గొంతు నొక్కి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అభివ్రుద్ధి, సంక్షేమ కార్యాలయాలు కన్పించడం లేదు. 31 జిల్లాల్లో కనీస మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.

టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు.  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల వేడుకల కోసం రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి.. రూ. 50 కోట్లు మాత్రమే విడుదల చేసి మోసం చేశారు. విశ్వ విద్యాలయ విద్యార్థుల పట్ల కేసీఆర్ కక్ష పూరితంగా వ్యవహరించారు. జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మండలానికో ఐటీఐ నిర్మాణం జరగలేదు.

ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో విడుదల చేయక పోవడం వల్ల పేదలు ఉన్నత విద్యకు దూరమయ్యారని పేర్కొంది. కేజీ టూ పీజీ ఎక్కడ కన్పించడం లేదు. నియోజకవర్గానికో రెసిడెన్సియల్ కాలేజీ ఏర్పాటు జరగలేదు. మహిళలు, గిరిజనుల ప్రత్యేక విశ్వ విద్యాలయాలు ఎక్కడా కన్పించడం లేదు.  ఆదునికి విద్యా ప్రణాళిక తయారు చేయలేదని పేర్కొంది.

సచివాలయానికి ఎన్నడూ రానీ కేసీఆర్.. కొత్త సచివాలయం కోసం బైసన్ పోటో గ్రౌండ్ ను ఎందుకు కోరడమేమిటని ప్రశ్నించింది. ఏడాదికి 70 రోజులు అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. 30 రోజుల మాత్రమే నిర్వహించారని, ఈ కారణంగా ప్రజా సమస్యలు చర్చకు రాలేదు. ఏడు లక్షల ఇళ్లు కట్టించకుంటే..ఓట్లను అడగనున్న.. కేసీఆర్.. కేవలం నాలుగువేల ఇళ్లు మాత్రమే నిర్మించి.. ఎలా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించాలని కోరింది.

ఇంటింటికి తాగునీరు అందిస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పిన కేసీఆర్.. అది నెరవేర్చకుండా.. ఎందుకు ఎన్నికలకు ముందస్తుగా వెళ్లారని నిలదీయాలని విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో 1200 వందల మంది ఆత్మబలిదానం చేసుకుంటే.. కేవలం 450 మందిని మాత్రమే ఎలా గుర్తించారని పేర్కొంది.

అమరుల కుటుంబాల్లో ఒక్కోక్కరికి ఉద్యోగమిస్తామని చెప్పి ఇవ్వలేదు. నియోజకవర్గానికో అమరుల స్థూపం, హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహమైందో నిర్మించలేదు. జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించలేదు.  సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్ లను మార్చి. అంఛనాలను పెంచి, ఆ మొత్తాన్ని జేబుల్లో వేసుకున్నారు. మిషన్ కాకతీయ పేరుతో జేబులు నింపుకున్నారు.

ఉస్మానియా ఆస్పత్రి కోసం విడుదల చేసిన రూ.100 కోట్లు విడుదల చేయలేదు. జిల్లాకో నిమ్స్, నియోజకవర్గానికో 100 పడకల ఆస్పత్రి, మండలానికో 30 పడకల ఆస్పత్రి రాలేదు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయలేదు. సిర్పూర్ పేపర్ మిల్, నిజాం చక్కెర కర్మాగారం, అజంజాహి మిల్లు, రేయన్ ఫ్యాక్టరీ తెరిపించలేదు. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులపై వడ్డీ భారం పడిందని, వడ్డీ మాఫీ చేస్తామని చేయలేదు.

రైతులు 4500 మంది ఆత్మహత్య చేసుకుంటే.. వారి కుటుంబాలను ఆదుకోలేదు.  రాష్ట్రం విత్తన భాండాగారం  చేయలేదు. మద్యాన్ని నియమంత్రిస్తామని చెప్పి, అమ్మకాలు పెరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల వేలాది కుటుంబాల పెద్దలు మృతి చెందారు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లోని చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో కోర్టు తీర్పును అమలు చేయని ఈ సర్కారు.. కొత్త డంపింగ్ యార్డ్ లు ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు.

సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. ధనిక రాష్ట్రమని చెప్పి.. అప్పుల రాష్ట్రంగా మార్చడంలో మాత్రం కేసీఆర్ విజయం సాధించారని ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఇటువంటి కేసీఆర్ సర్కారుకు డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో బుద్ధి చెప్పే బాధ్యత ప్రజలపైనే ఉందని ఆ పార్టీ నేతలు చెప్పారు.