ఎల్ కే అద్వానికి ప్రధాని మోడీ 91వ జన్మదిన శుభాకాంక్షలు

బిజెపి అగ్రనేత, మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్ కే అద్వాని 91వ జన్మ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అద్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ప్రభుతులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రాజకీయాలలో ఆయన వహించిన కీలక భూమికను, బిజెపిని సంస్థాగతంగా పటిష్ట పరచడంలో, సైద్దంతికంగా ప్రజల మధ్యకు తెసుకు వెళ్ళడంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

భారత దేశ అభివృద్దికి అద్వానిజీ కృషి అసామాన్యమైనది అని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా కొనియాడారు. మంత్రిగా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకు నిర్ణయాలు, ఆయన చేపట్టిన ప్రజలకు హితం చేరుక్చే విధానాలు ఎల్లప్పటికి స్పూర్తి దాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పక్షాల వారికి అయన ప్రదశించిన ప్రతిభ స్పూర్తిదాయకం అని తెలిపారు.  

నిస్వార్ధంగా, అనికిత భావంతో ఆయన దేశానికి అందించిన సేవలను, బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంలో జరిపిని కృషిని, కార్యకర్తలను తీర్చిదిద్దిన విధానం ప్రభావం ఎప్పటికి గుర్తుండి పోతుందని చెప్పారు. సుదీర్ఘకాలం బిజెపి అద్యక్షుడిగా ఆయన అందించిన సేవలను, వాజపేయి మంత్రివర్గంలో ఉప ప్రధానిగా అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తన జీవితాంతరం అంకిత భావంతో వ్యవహరించి బిజెపిని పటిష్ట పరచి, పార్టీ కార్యకర్తలకు స్పూర్తిదాయకంగా నిలిచి వారిలో క్రమశిక్షణను పెంపోదింప చేసారని అమిత్ షా పేర్కొన్నారు. జన సంఘ్ రోజుల నుండి, బిజెపి వరకు సిద్దాంతాన్ని ప్రజల వద్దు తీసుకు వెళ్ళడంలో, భారత దేశం ప్రగతి పంధాలో పయనించే విధంగా చేయడంలో విశేషంగా కృషి చేసిన నిపుణత గల రాజకీయ నేత అంటూ భారత రాజకీయాలలో ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

భారత రాజకీయాలలో ఉద్దండుడు అద్వాని అని రాజనాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆవిర్భావం నుండి బిజెపిని తీర్చి దిద్దిన ధీశాలి అని ప్రశంశలు కురిపించారు. లక్షలాది మంది కార్యకర్తలకు స్పూర్తి దాయకంగా నిలుస్తారని చెప్పారు.