రేపు విజయ్‌ ఘాట్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు

వాజ్‌పేయి మరణంతో ఆగస్టు 22వరకు ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా భారతీయ జెండాను సగం వరకు అవతనం చేయనున్నారు. 

వాజ్‌పేయి పార్థీవదేహాన్ని కృష్ణమీనన్‌ మార్గంలోని ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి అభిమానుల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

సాయంత్రం ఐదు గంటలకు యమునానది ఒడ్డున   విజయ ఘాట్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి.  వాజ్‌పేయి స్మారకంగా రాష్ట్రీయ స్మృతిస్థల్‌ విజయ్ ఘాట్‌లో నిర్మించాలని కుడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1.5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రకటన చేసింది.

ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించాల్సిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం కూడా వాయిదా పడింది.