ప్రపంచానికే వాజపేయి ఆదర్శం

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి యావత్‌ ప్రపంచానికి వాజ్‌పేయి ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కొనియాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతి పట్ల సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా, ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీర‌ని లోట‌ని నివాళులు అర్పించారు.

ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన అట‌ల్జీ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కెసిఆర్ పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించిన గొప్పనేత అంటూ కీర్తించారు.

నిజమైన రాజనీతిజ్ఞుడు మరణించారని మంత్రి కేటి రామారావు ట్వీట్ చేశారు. నాయకుడు అనే పదానికి నిజమైన నిర్వచనం వాజ్‌పేయి అని అతను ప్రసంగాల్లో వాజ్‌పెయి దిట్టఅని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే భవిష్యత్తు తరాలు ఆయన్ను గుర్తుంచుకుంటాయని మంత్రి తెలిపారు.