ట్రంప్‌పై మీడియా తిరుగుబాటు

పత్రికా స్వేచ్చను హరిస్తున్నారని, పత్రికల పట్ల బెదిరింపు ధోరణులు అనుసరిస్తున్నారని అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మీడియా తిరుగుబాటు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన సుమారు 350 పత్రిక సంస్థలు ట్రంప్‌పై తమ ఆగ్రహన్ని వ్యక్తం చేశాయి. పత్రిక స్వేచ్ఛను డిమాండ్ చేస్తూ, ఆ సంస్థలు ఇవాళ తమ పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశాయి. ట్రంప్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టాయి.

మీడియాపై ట్రంప్ ఓ నీచ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని, దాన్ని వ్యతిరేకించాలని గత వారం రోజుల క్రితం బోస్టన్ గ్లోబ్ ఓ పిలుపునిచ్చింది. తమ ప్రభుత్వంపై వస్తున్న వార్తలను ట్రంప్ ఇటీవల ఖండించారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్‌ను రాస్తున్నాయని, ప్రజా శత్రువులు జర్నలిస్టులే అని ట్రంప్ ద్వజమెత్తారు. 

దీంతో అమెరికా మీడియా సంస్థలు.. దేశాధ్యక్షుడిపై సీరియస్ అయ్యాయి. దీని వల్ల జర్నలిస్టులపై దాడులు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే బోస్టన్ గ్లోబ్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సుమారు 350 పత్రికా సంస్థలు తమ ఎడిటోరియల్స్‌లో ట్రంప్ విధానాన్ని వ్య‌తిరేకించాయి.