ఇంకా విషమంగానే వాజపేయి ఆరోగ్యం

బిజెపి కురువృద్దుడు, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. మరింతగా దిగాజరిన్నట్లు చెబుతున్నారు.  దానితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆసుపత్రికి వచ్చి ఆయనను చూడవచ్చని భావిస్తున్నారు.

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు గురువారం ఉదయం తాజాగా హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు పేర్కొన్నారు.ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఆస్పత్రికి వచ్చి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బనేర్జీ కుడా వాజపేయిను చూడడం కోసం కొలకత్తా నుండి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అద్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కుడా వాజపేయిని పరామర్శించడం కోసం రానున్నారు. ఉదయం నుంచి బీజేపీ నేతలు, పలు రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. వాజ్‌పేయి కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. ఎయిమ్స్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.