ఏపీలో మహాకుటమి ఏర్పాటే చంద్రబాబు లక్ష్యం !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎన్నికలలో సొంతంగా పోటీ చేసి పార్టీని విజయం వైపు తీసుకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఆయన నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ గెలుపొంది, అధికారం చేపట్టిన రెండు సార్లు కూడా బీజేపీతో పొట్టు సహకరించింది. బీజేపీ లేకుండా 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఓటమి తప్పలేదు.

గత ఎన్నికలలోనే బొటాబొటి ఆధిక్యతతో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి సొంతంగా పోటీ చేస్తే గెలుపొందగలమని సాహసం చేయడం లేదు. ఇప్పుడు బీజేపీకి దూరం కావడం, ప్రధాన ప్రతిపక్షం వైసిపితో కలిసే అవకాశం లేకపోవడం, మరోవంక పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో సహితం సంబంధాలు వికటించడంతో కోత్త పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం అంటూ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కావడం కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో `మహాకుటమి’ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నం గానే స్పష్టం అవుతున్నది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పొత్తుకు సిద్దపడిన రెండు వామపక్షాలను సహితం తమ వైపుకు తిప్పుకొని, కాంగ్రెస్ తో కలిపి `మహాకుటమి’ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికలలో ఈ పార్టీలు ఒక్క సీట్ ను కుడా గెలుపొండక పోవడం గమనార్హం. ఒకటి, రెండు సీట్లలో మించి డిపాజిట్ లను కుడా పొందేలక పోయారు. అటువంటి పార్టీలే ఆయనకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వామపక్షాలలో ఇప్పటికే సిపిఐ నాయకులతో సంబంధాలను ఏర్పరచుకో గలిగారు. సిపిఏం నాయకులు కొంచెం `బెట్టు’ చేస్తున్నా ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ నాయకుల ద్వారా వారిని దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో కుడా ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ 140 శాసనసభ, 18 లోక్‌సభ స్థానాల్లో పోటీకి పరిమితం కావడానికి సిద్దపడుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 25, వామపక్షాలకు 10 స్థానాలు వదలాలని భావిస్తున్నారు. ఇక లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్ 5, వామపక్షాలు 2 చోపున స్థానాలు వదిలే అవకాశాలు ఉన్నాయి.