రాజ్యసభ సభ్యత్వం కోసం డి శ్రీనివాస్ నాటకం !

మాజీ పిసిసి అద్యక్షుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిన్నట్లే ఆయన అధికారికంగా ఇప్పటి వరకు ఆ పార్టీలో చెరక పోవడంతో ఆయన అధికారికంగా కొంతకాలం మరే పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తున్నది. అయినా కాంగ్రెస్ పార్టీ తోనే ఉండబోతున్నారు. ఆయనకు ఇంకా నాలుగేళ్ళపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండే అవకాశం ఉంది. ఆయనను ఇప్పటి వరకు అధికారికంగా టిఆర్ఎస్ ను బహిష్కరించనే లేదు. ఇప్పుడు సాంకేతికంగా పార్టీ మారితే రాజ్యసభ సభ్యత్వం కోల్పోవలసి వస్తుంది.

శ్రీనివాస్ `రాజీనామా’ చేస్తే ఆయన స్థానంలో ఈ మధ్యనే కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన మాజీ స్పెకర్ సురేష్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని టిఆర్ఎస్ ఆలోచిస్తున్నది. అసెంబ్లీకి వరుసగా రెండు సార్లు ఓటమి చెందినా ఆయన ఇప్పుడు పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు లేవు. లోక్ సభకు పోటీ చేద్దాం అంటే నిజామాబాద్ లో ఏఐసిసి కార్యదర్శి మధు యాష్కి ఉన్నారు. దానితో రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం అధికారికంగా కాంగ్రెస్ లో చేరబోరని చెబుతున్నారు.

గతవారం కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీని కలసినప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నరనే వార్తలు వచ్చాయి. అయితే తాను మర్యాద పూర్వకంగానే కలిసానని చెబుతూ “నేను కాంగ్రెస్ లో చేరుతున్నానని చెప్పనా” అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యసభకు ఉప ఎన్నిక జరిగినా తిరిగి శ్రీనివాస్ గెలుపొందే అవకాశం ఉంటె మాత్రమె రాజీనామా చేసే విషయం పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే 70 ఏళ్ళ వయస్సులో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేయలేరు. దానితో ప్రస్తుతానికి వార్తలకు మాత్రమె పరిమితమై ఉండే అవకాశం ఉంది.