రాజధాని కోసం అప్పులేందుకు చంద్రబాబు !

రాజధాని అమరావతి నిర్మాణం తమ బాధ్యత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పలుసార్లు చెబుతూ వచ్చారు. అయితే ఈ మధ్య వరకు డిజైన్లు కుడా ఖరారు చేయకుండా, వాటి పేరుతో పలు దేశాల పర్యటనలతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. రాజధాని కోసం ఇచ్చిన రూ 1,500 కోట్లకు లెక్కలు అడుగుతుంటే అంతెత్తున ఎగురుతూ అసలు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలన్నది విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న అంశం. రాజధానికి చెందిన  కీలక భవనాలతో పాటు, మౌలిక సదుపాయాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయమై పలు సందర్భాలలో కేంద్రం స్పష్టం చేసింది కుడా. అయితే వీటి నిర్మాణాల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ, తగు రీతిలో ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షణలో జరగవలసి ఉంటుంది.

కేంద్రం నుండి నిధులు రాబట్ట్టే ప్రయత్నం చేయకుండా, ఈ విషయమై కనీసం కేంద్రాన్ని సంప్రదించే ప్రయత్నం కుడా లేకుండా ఏకంగా రాజధాని నిర్మాణం కోసం అంటూ `అమరావతి బాండ్లు’ జారీ చేయడం ప్రారంభించారు. షేర్ మార్కెట్ లో రూ 2,000 కోట్ల అప్పులను సేకరించారు. మరిన్ని నిధులను అప్పుల రూపంలో సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులు అయితే వాటికి పక్కాగా లెక్కలు చెప్పాల్సి ఉంటుందని, అదే ప్రభుత్వం అప్పులు చేస్తే ఎలా ఖర్చు పెట్టుకున్నా అడిగే వారుండరనే ఈ విధంగా చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకే బాండ్ మార్కెట్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా 10.38 శాతం వడ్డీ రేటుకు బాండ్లు జారీ చేసి నిధులు సమీకరించారు. ఈ అనుభవంతో రాబోయే రోజుల్లోనూ ఇదే స్పీడ్ గా అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్దపడుతున్నట్లు తెలుస్తున్నది.

బాండ్లు సూపర్ సక్సెస్ అని, ఇది చంద్రబాబు ఇమేజ్ కు చిహ్నం అని పేర్కొంటూ టిడిపి నేతలు సంబరాలు చేసుకొంటున్నారు. అయితే ఎలాంటి గ్యారంటీ లేకుండా బాండ్లను కొనుగోలు చేస్తే  అలాగే అనుకోవచ్చని, దేశంలో మరెక్కడా లేనంత అధిక వడ్డీ రేట్ కు, పైగా బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వమే పూచీకత్తు ఉన్నదని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు. వాటిని అమ్మాడాన్ని కుడా ఘనకార్యంగా ప్రచారం చేసుకొంటున్నారు.

చంద్రబాబు ‘బ్రాండ్’ ను చూసే సింగపూర్ కంపెనీలు చకచకా రాజధాని నిర్మాణంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నాయని అంటూ గతంలో పెద్దేత్తున ప్రచారం చేసారు. తీరా చూస్తే ఒక్క భవనం కట్టడానికి కుడా సింగపూర్ కంపెనీలు కనీసం టెండర్ కూడా వేయలేదు.  

అమరావతి బాండ్లపై సర్కారు చెల్లించే వడ్డీ 10.32 శాతం ఇవ్వడం దిక్కుతోచక చేస్తున్న చర్యగా ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సర్కారు కు చెందిన జీహెచ్ఎంసీ కూడా బాండ్స్ మార్కెట్ ద్వారా రుణాలు సేకరించింది. రెండవ విడత సేకరించిన  ఈ బాండ్లపై వడ్డీ రేటు 8.75 శాతమే. దానినే చాల ఎక్కువ రేట్ అని విశ్లేషకులు వింరిస్న్చారు. ఇప్పుడు అమరావతి బాండ్లను 10.32 శాతం వడ్డీ చెల్లించటానికి ప్రభుత్వం సిద్దపడటం అంటే ప్రజాధనాన్ని వృద్ద చేయడమే కాగలదు.

వాస్తవానికి అమరావతి బాండ్లకు సంబంధించిన వడ్డీ రేట్లను చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్థిక శాఖే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. వివిధ శాఖల వద్ద ఉన్న నిధులను తాము సర్దుబాటు చేస్తామని, అంత ఎక్కువ రేట్లతో కూడిన బాండ్లు కూడా వద్దని వారించింది. అయినా సరే చంద్రబాబు ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చేసి, తాను అనుకున్నట్లు అత్యధిక వడ్డీతో ఏకపక్షంగా బాండ్లను జారీ చేశారు. అదేదో తన గొప్పతనం, తన బ్రాండ్ ఇమేజ్ అని డబ్బా కొట్టించుకోవటం చూసి అధికార వర్గాలు కూడా విస్మయానికి గురవుతున్నాయి.