రక్షణ, ప్రాంతీయ బద్రత అంశాలపై జపాన్ తో మోదీ చర్చలు

13వ భారత్ – జపాన్ వార్షిక సదస్సుకు హాజరు కావడానికి గత రాత్రి జపాన్ కు చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత సంతతికి చెందిన వారితో పాటు జపాన్ మంత్రి, ఉన్నతాధికారులు టోక్యోలో ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి సదస్సు జరుగనున్న గ్రామీణ ప్రాంతం యమనషికి చేరుకున్నారు.

ఈ సదస్సు  జరుగుతున్న హోటల్ మౌంట్ ఫుజిలో ప్రధాని మోదీకి జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే స్వాగతం పలికారు. రెండు రోజుల పటు జరిగే ఈ సదస్సులో రెండు దేశాల మధ్య గల సంబంధాలను సమీక్షించి, ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం గురించి చర్చలు జరుపుతారు. రక్షణ, ప్రాంతీయ బద్రత వంటి పలు ముఖ్యమైన అంశాల గురించి మోదీ ఈ సందర్భంగా జపాన్ ప్రధానితో చచిస్తారు.  

ఆదివారం మధ్యాన్నం అబే తో కలసి మోదీ విందులో పాల్గొంటారు. తర్వాత ప్రపంచంలోనే ప్రముఖ ఆటోమేషన్ కంపెనీని ఇద్దరు ప్రధానులు సందర్శిస్తారు. రాత్రికి తన హాలిడే హోంలో ప్రైవేటు డిన్నర్ ను మోదీకి ఇవ్వనున్నారు. తర్వాత ఇద్దరు ప్రధానులు కలసి రైల్ లో ప్రయాణించి టోక్యోకు చేరుకుంటారు.

ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇద్దరు నాయకులు భారత్-పసిఫిక్ ప్రాంతంలోని పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా   సమాలోచనలు  జరిపే అవకాశం ఉంది. టోక్యోలో భారతీయులతో జరిగే కార్యక్రమలో పాల్గొనడంతో పాటు పలువురు వ్యాపార సంబంధ కార్యక్రమలో కుడా ప్రధాని మోదీ పాల్గొంటారు.

జపాన్ ప్రధాని అబేను మోదీ కలుసుకోవడం ఇది 12వ సారి కావడం గమనార్హం. సెప్టెంబర్, 2014లో మొదటి సరిగా అబే భారత దేశ పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. “నేను టోక్యోకు చేరుకున్నాను. నా పర్యటన భారత్, జపాన్ ల మధ్య నెలకొన్న బలమైన స్నేహ సంబంధాలలో నూతన ఉత్సాహం కలిగించగలదని భావిస్తున్నాను” అంటూ ప్రధాని మోదీ త్వీట్ ఇచ్చారు.

జపాన్ కు బయలుదేరే ముందు రెండు దేశాల గల మధ్య సంబంధాలు ఆర్ధిక, వ్యూహాత్మకమైనవని, అవి ఈ మధ్య సంవత్సరాలలో పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. భారత ఆర్ధిక, సాంకేతిక ఆధునీకరణలో అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి జపాన్ అని కొనియాడారు.