ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని? : కేటీఆర్

విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడం తెలంగాణాలో పెను దుమారం రేపుతున్నది. న విషయం తెలిసిందే. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదని, కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారని మంత్రి కె టి రామారావు ఆరోపించారు.

విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు గట్టిగా ప్రశ్నిస్తే తాము ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులమని వారు చెప్పారని పేర్కొన్నారు. సర్వే చేసిన ఏపీ పోలీసుల వివరాలన్నీ తమతో కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇలా ఉండగా, తమ వాహనాలను పోలీస్ తో తనిఖి చేయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తమను వేదిస్తున్నదని అంటూ కొందరు ప్రతిపక్ష నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడాన్ని దయ్యబట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేసారు. తమ వాహనాన్ని తనిఖీ చేసినా అభ్యంతరం లేదని తెలిపారు. తెలంగాణలో పైసలు పంచడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పేర్కొంటూ తెలంగాణలో అరాచకానికి చంద్రబాబు పూనుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు

ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులతో తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఏపీ ప్రజల సొమ్ములతో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడి పైసలతో ఇక్కడ ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ రూ 500 కోట్లతో చంద్రబాబు. రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ లేదని చెబుతూ  ఉత్తమ్ కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో ఆయన ఇన్నోవా కారులో రూ.3 కోట్లు కాల్చుకున్నాడని గుర్తు చేసారు. చిల్లర మల్లర రాజకీయాల కోసం పోలీసులను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.