ఛత్తీస్ గఢ్‌లో వరుసగా నాలుగోసారి బిజెపి ప్రభుత్వం !

ఛత్తీస్ గఢ్‌లో వరుసగా తిరిగి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ప్రస్తుతం జరుగుతున్నా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తిరిగి ఘన విజయం సాధిస్తుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ ప్రీపోల్‌ సర్వే వెల్లడించింది. రమణ్‌సింగ్‌ నేతృత్వంలో బీజేపీ వరుసగా నాలుగోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోనుందని, కాంగ్రె్‌సకు మరోసారి నిరాశ తప్పదని పేర్కొంది.

మొత్తం 90 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 50 సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజారిటీ సాధించనుందని, ఈ సంఖ్య 5 సీట్లు పెరగడమో, తగ్గడమో కూడా జరగవచ్చని తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 30 స్థానాలతోనే సరిపెట్టుకొని మరోసారి ప్రతిపక్ష హోదాకే పరిమితం కానుందని తేల్చింది. ఈ పార్టీ గెలిచే స్థానాల సంఖ్య కూడా 25-35 మధ్య ఉండే అవకాశముందని పేర్కొంది.

ఇక బీఎస్పీ, అజిత్‌జోగి సారథ్యంలోని జేసీసీజేల కూటమికి కలిపి కేవలం 9 సీట్లే దక్కనున్నాయని, ఇతరులకు ఒక సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో బీజేపీ 42.2 శాతం సాధించనుందని, ఇది గత ఎన్నికల కన్నా 1.16 శాతం అధికమని సర్వే వెల్లడించింది. కాంగ్రె్‌సకు 37.21 శాతం రావచ్చని, 2013 ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీ 3.08 శాతం ఓట్లను కోల్పోవచ్చని పేర్కొంది. ఇక బీఎస్పీ-జేసీసీజే కూటమికి 6.38 శాతం ఓట్లు రావచ్చని, ఇతరులు గణనీయంగా 14.21 శాతం ఓట్లు పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్‌కే ప్రజలు మళ్లీ పెద్ద ఎత్తున మద్దతు పలకనున్నట్లు సర్వే పేర్కొంది. 40.71 శాతం ప్రజలు మళ్లీ సీఎంగా ఆయననే కోరుకోగా, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బాఘేలాను 19.2 శాతం ప్రజలు మాత్రమే కోరుకుంటున్నట్లు తెలిపింది.